
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తనకు తానే ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చుకున్నాడు. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశాడు. ఆ కారు ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది.
`అర్జున్ సురవరం` సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ఈ కారును కొనుగోలు చేసినట్టు నిఖిల్ తెలిపాడు. లాక్డౌన్ కారణంగా ఈ కారు కొనడం కాస్త ఆలస్యమైనట్టు చెప్పాడు. లాక్డౌన్ సమయంలోనే ఓ ఇంటివాడైన నిఖిల్.. ప్రస్తుతం `కార్తికేయ- 2`, `18 పేజెస్` సినిమాల్లో నటిస్తున్నాడు.