ltrScrptTheme3

Nikhil: నాలుగు సినిమాలతో బిజీ బిజీ..

Oct 26 2021 @ 12:41PM

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. 'హ్యాపీడేస్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 'యువత' మూవీతో సోలో హీరోగా మారాడు. 'స్వామి రారా', 'కార్తికేయ' వంటి సినిమాలతో సూపర్ హిట్స్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఎక్కువగా ప్రయోగాలు చేసేందుకు రెడీగా ఉంటాడు. ఆ మధ్య కెరీర్ కాస్త స్లో అయినప్పటికీ 'అర్జున్ సురవరం' సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న నాలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తాజాగా ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2', 'కుమారి 21 ఎఫ్ ఫేమ్' పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ - జీఏ2 బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న '18 పేజెస్' సినిమాలతో పాటు మరో రెండు సినిమాలను చేస్తున్నాడు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.