Karthikeya 2 ట్రైలర్: ఇది ఆపలేని యాగం.. ఆజ్యం అక్కడ మొదలైంది

Published: Fri, 24 Jun 2022 18:24:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Karthikeya 2 ట్రైలర్: ఇది ఆపలేని యాగం.. ఆజ్యం అక్కడ మొదలైంది

Karthikeya 2: ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil), చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కార్తికేయ‌ 2’ (Karthikeya2). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ 1ని హైదరాబాద్ ఏఏంబీ సినిమాస్‌లో ప్రదర్శించడమే కాకుండా.. అఫీషియల్‌గా కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


‘ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం అక్కడ మొదలైంది..’ అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం విజువల్ ఫీస్ట్‌లా ప్రేక్షకులను అలరించింది. అంతే కాదు, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. ‘ప్రాణ త్యాగం చేసే ధైర్యం ఉంటేనే.. దానిని నువ్వు పొందగలవు..’ అనే డైలాగ్‌తో ఈ సినిమాలో దేని కోసమో హీరో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ‘అసలు కృష్ణుడేంటి? ఈ కథని ఆయనే నడిపించడం ఏంటి? అంటూ హీరో పలికే డైలాగ్‌తో.. దైవం ఈ సినిమాలో ప్రధాన పాత్ర వహిస్తుందనేలా క్లారిటీ ఇచ్చారు. ‘విశ్వం ఒక పూసల దండ.. ప్రతిదీ నీకు సంబంధమే.. ప్రతిదీ నీ మీద ప్రభావమే..’ అంటూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చెప్పిన డైలాగ్‌తో ఇది ఏ తరహా చిత్రమో.. తెలిసిపోతుంది. అంతేకాదు.. మ్యూజిక్, కెమెరా వర్క్ కూడా అబ్బురపరిచే స్థాయిలో ఉండటంతో.. ‘కార్తికేయ 2’ చిత్రం సాధారణ చిత్రమైతే కాదు అనేలా.. ఈ ట్రైలర్‌తో టాక్ మొదలైంది. కాగా, నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రాన్ని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International