సాఫ్ట్‌బాల్‌ సంఘం జిల్లా అధ్యక్షురాలిగా నిఖిలశ్రీ

ABN , First Publish Date - 2021-07-26T05:30:00+05:30 IST

విశాఖపట్నం జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షురా లిగా డి.నిఖిలశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సాఫ్ట్‌బాల్‌ సంఘం జిల్లా అధ్యక్షురాలిగా నిఖిలశ్రీ
నూతన కార్యవర్గం ప్రతినిధులు

విశాఖపట్నం (స్పోర్ట్సు), జూలై 26 : విశాఖపట్నం జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షురా లిగా డి.నిఖిలశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నగరంలో జరిగిన కొత్త కార్యవర్గ ఎన్నికల్లో కార్యదర్శిగా ఎన్‌.నిషి ఏంజలినా, కోశాధికారిగా అక్కునాయుడు ఎన్నికయ్యారు. జిల్లా క్రీడాఽ ప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ ఎన్‌.సూర్యారావు, రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ సంఘం కార్యదర్శి వెంకటేశులు పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలకు కె.కోటీశ్వరరావు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించారు. 

Updated Date - 2021-07-26T05:30:00+05:30 IST