వైభవంగా నీలకంఠేశ్వరుడి గ్రామోత్సవం
ABN , First Publish Date - 2021-06-22T06:49:09+05:30 IST
మండలంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, నూతన దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు, నూతన కలశాల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
మడకశిర, జూన్ 21: మండలంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, నూతన దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు, నూతన కలశాల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఆలయ కమిటీ చైౖర్మన్ రఘువీరారెడ్డి, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.