కోర్టు తీర్పుపై చిరునవ్వే నిమ్మగడ్డ సమాధానం

ABN , First Publish Date - 2021-01-22T08:38:55+05:30 IST

కోర్టు తీర్పుపై చిరునవ్వే నిమ్మగడ్డ సమాధానం

కోర్టు తీర్పుపై చిరునవ్వే నిమ్మగడ్డ సమాధానం

ద్వారకా తిరుమల, జనవరి 21: ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలో 40 నిమిషాలు ఽధ్యానముద్రలో కూర్చుకున్నారు. అనంతరం స్వామి, అమ్మ వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. స్వామి సందర్శనతో మీ కోరిక నెరవేరిందా అని విలేకరులు అడిగితే.. అంతా స్వామి వారి దయ అన్నట్లు చేతులు పైకెత్తి నమస్కరించారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును ప్రస్తావించగా.. చిరునవ్వు నవ్వారు.

Updated Date - 2021-01-22T08:38:55+05:30 IST