
ప.గో.జిల్లా: నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు చేస్తున్న ఆమరణ దీక్షా శిబిరాన్ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటని విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రానికి 26 జిల్లాలను ఏర్పాటు చేసి పాలన సాగించే సత్తా జగన్ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని, జనాభా లెక్కలు, నియోజక వర్గాల పునర్విభజన జరగకుండా కొత్త జిల్లాల ఏర్పాటుతో అనేక సమస్యలు వస్తాయని నిమ్మల రామానాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి