Advertisement

జగన్ అనే సుడి గుండంలో పోలవరం మునిగిపోతోంది: నిమ్మల

Feb 28 2021 @ 13:46PM

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడీ, ప్రాణావాయువు లాంటిది పోలవరం ప్రాజెక్ట్ అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు 70 శాతానికి పైగా పూర్తి చేశారన్నారు. సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చీకటి ఒప్పందం చేసుకొని, పోలవరం విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా ప్రభుత్వ సలహాదారు శ్రీరామ్‌రెడ్డి శిల్పారెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, రేడియల్ గేట్లు డిజైన్లు క్వాలిటీలో ప్రభుత్వం రాజీ పడుతోందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మూడు సార్లు పోలవరం ప్రాజెక్ట్  పూర్తి తేదీ మార్చారన్నారు. సీఎం జగన్ అనే సుడి గుండంలో పోలవరం మునిగిపోతోందన్నారు. విశాఖకు నీటి సమస్యతో పాటుగా, సోమశిల, సాగర్‌కు కూడా నీరు అందదని, రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. నిర్వాసితుల వ్యయం తగ్గించడానికి పొలవరం ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టారని, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితిలో ఉందని రామానాయుడు పేర్కొన్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.