Eid Al-Fitr: వరుసగా 9రోజులు సెలవులు!

ABN , First Publish Date - 2022-04-06T18:46:11+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో ఈ సారి ఈద్ అల్-ఫితర్(రంజాన్) సెలవులు ఏకంగా తొమ్మిది రోజులు ఉండనున్నాయి.

Eid Al-Fitr: వరుసగా 9రోజులు సెలవులు!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో ఈ సారి ఈద్ అల్-ఫితర్(రంజాన్) సెలవులు ఏకంగా తొమ్మిది రోజులు ఉండనున్నాయి. ఈ నెల 29 నుంచి మే 7వ తేదీ వరకు సెలవుదినాలుగా ప్రకటించింది. ఇందులో మే 1(ఆదివారం), మే 5(గురువారం) విశ్రాంతి దినాలుగా పేర్కొంది. ఈ రెండు రోజులు కూడా సెలవుదినాలుగా పరిగణించబడతాయి. దీంతో వరుసగా ఏప్రిల్ 29 నుంచి 7 వరకు 9 రోజుల పాటు రంజాన్ సెలవులు ఉండనున్నాయి. కాగా, ఈ నెల 2 నుంచి ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు మే 2వ తేదీ(సోమవారం)తో ముగుస్తాయి. అందుకే అదే రోజు పండుగ జరుపుకోవాలని కువైత్ నిపుణులు, ఖగోళ కేంద్రాలు వెల్లడించాయి. అలాగే సోమవారం అనేది ఈద్‌లో తొలిరోజుగా పేర్కొనడం జరిగింది.   

Updated Date - 2022-04-06T18:46:11+05:30 IST