Eid al-Adha: కువైత్‌లో తొమ్మిది రోజులు సెలవులు

ABN , First Publish Date - 2022-06-14T16:29:16+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ ఈద్ అల్-అదా (Eid al-Adha) (బక్రీద్) సందర్భంగా 9 రోజులు సెలవులు ప్రకటించింది.

Eid al-Adha: కువైత్‌లో తొమ్మిది రోజులు సెలవులు

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ఈద్ అల్-అదా (Eid al-Adha) (బక్రీద్) సందర్భంగా 9 రోజులు సెలవులు ప్రకటించింది. జూలై 10(ఆదివారం) నుంచి జూలై 14(గురువారం) వరకు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులు ఉంటాయని కువైత్ మంత్రి మండలి వెల్లడించింది. అలాగే రెండు వారాంతాలు కలుపుకుంటే మొత్తం సెలవులు 9 రోజులు అవుతాయని పేర్కొంది. ఈ తొమ్మిది రోజుల పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు మూసే ఉంటాయని తెలిపింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి జూలై 17న తెరచుకుంటాయని మంత్రిమండలి వెల్లడించింది. ఇక వరుసగా 9రోజులు సెలవులు రావడం పట్ల కువైత్ నివాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా గత కొంతకాలంగా టూర్లకు వెళ్లడం కుదరని వారు ఈ లాంగ్‌వీకెండ్‌లో ప్లాన్ చేసుకుంటున్నారు.  

Updated Date - 2022-06-14T16:29:16+05:30 IST