Dominican Republicలో ప్రైవేట్ విమానం కూలి 9 మంది మృతి
ABN , First Publish Date - 2021-12-16T12:49:49+05:30 IST
డొమినికన్ రిపబ్లిక్లో ఓ ప్రైవేటు విమానం కుప్పకూలిపోయిన ప్రమాద దుర్ఘటనలో 9 మంది మరణించారు....
శాంటో డొమింగో : డొమినికన్ రిపబ్లిక్లో ఓ ప్రైవేటు విమానం కుప్పకూలిపోయిన ప్రమాద దుర్ఘటనలో 9 మంది మరణించారు.కూలిపోయిన ప్రైవేటు విమానంలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు ఉన్నారు. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని లాస్ అమెరికాస్ ఎయిర్పోర్ట్లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.ఏడుగురు ప్రయాణికుల్లో ఆరుగురు విదేశీయులు కాగా, ఒకరు డొమినికన్ దేశ పౌరుడని విమానం ఆపరేటర్ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ ట్వీట్ చేసింది.విమానం డొమినికన్ రిపబ్లిక్ నుంచి అమెరికాలోని ఫ్లోరిడాకు వెళుతుండగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి టేకాఫ్ అయిన పదిహేను నిమిషాలకే కుప్పకూలినట్లు అమెరికా మీడియా తెలిపింది.ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.