ముంబై నగరంలో న్యూఈయర్ పార్టీలపై నిషేధం ఉన్నా, విందు ఎలా ఏర్పాటు చేశారని, యువతి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతి జుట్టు పట్టుకొని కొట్టడంతో తలపై గాయమైందని దీంతో మరణించిందని పోలీసులు చెప్పారు. పోలీసులు పార్టీ నిర్వాహకుడితోపాటు విందులో పాల్గొన్న వారిని ప్రశ్నిస్తున్నారు.