నిఫా వైరస్ కలకలం... 12 ఏళ్ల బాలునిలో లక్షణాలు!

ABN , First Publish Date - 2021-09-05T14:57:44+05:30 IST

కేరళలోని కోజికోడ్‌కు చెందిన 12 ఏళ్ల బాలునిలో...

నిఫా వైరస్ కలకలం... 12 ఏళ్ల బాలునిలో లక్షణాలు!

కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌కు చెందిన 12 ఏళ్ల బాలునిలో నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. రాష్ట్రంలో తిరిగి నిఫా వైరస్ కనిపించడంతో నిన్న అర్థరాత్రి దాటాక ఉన్నత వైద్యాధికారుల అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్రప్రభుత్వం ఇంకా అధికారికంగా నిఫా వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించలేదు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈరోజు ఉదయం కోజికోడ్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. దక్షిణ భారత దేశంలోని కేరళలోని కోజికోడ్‌లో 2018 మే 19న తొలిసారిగా నిఫా వైరస్ కనిపించింది. జూన్ 2018 నాటికి ఈ వైరస్ కారణంగా 17 మంది మృతి చెందారు. అప్పట్లో మొత్తం 18 నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-09-05T14:57:44+05:30 IST