అడుగడుగునా నీరాజనం

ABN , First Publish Date - 2022-08-13T05:17:46+05:30 IST

75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి చేపట్టిన ‘ఆజాది కా గౌరవ్‌’ పాదయాత్ర నాలుగోరోజైన శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది.

అడుగడుగునా నీరాజనం
కందిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పూలమాలలతో సత్కరిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

టీపీసీసీ పిలుపు మేరకు కొనసాగుతున్న ‘ఆజాది కా గౌరవ్‌’ పాదయాత్ర

నాలుగో రోజుకు చేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర


 కంది, ఆగస్టు 12: 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి చేపట్టిన ‘ఆజాది కా గౌరవ్‌’ పాదయాత్ర నాలుగోరోజైన శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. సదాశివపేట మండలం ఆరూరు నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్రలో పాల్గొన్న జగ్గారెడ్డికి అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి సమీపంలో పోతిరెడ్డిపల్లిచౌరస్తా నుంచి ప్రారంభమైన పాదయాత్ర కంది, కవలంపేట గ్రామాల మీదుగా గణే్‌షగడ్డ వరకు చేరుకున్నది. కందిలో కాంగ్రెస్‌ నాయకులు జగ్గారెడ్డికి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు పెద్దఎత్తున కందికి చేరుకుని జగ్గారెడ్డిని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. పాదయాత్రలో జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ్‌ కుమార్‌, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, కూతురు జయారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు ఆంజనేయులు, చిన్న సాయి శ్రీరామ్‌, ప్రకాశ్‌, నవాజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


మహనీయుల త్యాగాలతోనే స్వాతంత్య్రం 

నారాయణఖేడ్‌, ఆగస్టు 12: బ్రిటీషు పాలకుల లాఠీలకు, తూటాలకు భయపడకుండా  దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన మహనీయుల త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌, టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం టీపీసీసీ పిలుపు మేరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా మండల పరిధిలోని హంగర్గ.కె నుంచి హంగర్గ.బి, చాప్టా.కె, నాగాపూర్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అకాల వర్షాలు, వరద ముంపుతో నష్టపోయిన రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.15వేల చొప్పున ఆర్థిక సహాయం చెల్లించాలన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. వారివెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రణాళిక మండలి మాజీ సభ్యుడు నగేష్‌ షెట్కార్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకరయ్యస్వామి, జిల్లా పరిషత్‌ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు రషీద్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వైజ్యనాథ్‌,  కాంగ్రెస్‌ నాయకులు తాహేర్‌ అలీ, సాయిలుపటేల్‌, నెహ్రునాయక్‌, సాయిలు, సుభా్‌షరావు, మధు, మనీ్‌షపాటిల్‌, కౌన్సిలర్లు దారం శంకర్‌, వివేకానంద్‌, శివకుమార్‌, నారాయణరెడ్డి ఉన్నారు. 


యువతను తాగుబోతులుగా చేసిన టీఆర్‌ఎస్‌

టేక్మాల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలోని యువతను తాగుబోతులుగా తయారు చేసిందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా అన్నారు. టేక్మాల్‌ మండలం బొడ్మట్‌పల్లి నుంచి టేక్మాల్‌ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు.ముందుగా బొడ్మట్‌పల్లిలోని వీరభద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. టేక్మాల్‌ చౌరస్తాలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ముగించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో యువతను తాగుబోతులుగా తయారు చేశారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందన్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు తమకేమి కనబడనట్లుగానే వ్యవహరిస్తున్నారన్నారు.  మునుగోడులో ప్రజలు తమ ఓటు హక్కును సరైన వ్యక్తికే ఓటు వేసి గెలిపిస్తారని తమ పార్టే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టేక్మాల్‌లోని స్వాతంత్య్ర సమరయోధుడు వీల్‌ సంగప్పకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో పార్టీ  మండల అధ్యక్షుడు రమేష్‌, నాయకులు సత్యనారాయణ, కిషన్‌, మల్లారెడ్డి, భిక్షపతి, రాజు, సుధాకర్‌, మోహన్‌, సంగమేశ్వర్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, మహేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


దేశ సమగ్రత కాంగ్రెస్‌తోనే సాధ్యం

పాపన్నపేట : దేశ సమగ్రత కాంగ్రె్‌సతోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బాలకృష్ణ, కార్యదర్శి సుప్రభాతరావు, జిల్లా కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 75 కిలోమీటర్ల పాదయాత్రను శుక్రవారం పాపన్నపేటలో ప్రారంభించారు. పాపన్నపేట నుంచి 22కిలోమీటర్లు మంబోజిపల్లి వరకు వందలాది కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. మిగతా 53కిలో మీటర్లు నర్సాపూర్‌, ఘణాపూర్‌ మండలాల్లో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షుడు గోవింద్‌, జిల్లా అధికార ప్రతినిధులు శ్రీకాంతప్ప, ఆంజనేయులు, రమేష్‌, నిఠాలక్షప్ప, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి,  నాలుగు మండలాల అధ్యక్షుడు శ్రీనివాస్‌, లింగంగౌడ్‌, శ్యాంరెడ్డి, రాంచంద్రాగౌడ్‌, శంకర్‌, రమణ, శ్రీమాన్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి,తో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:17:46+05:30 IST