నిర్మల్: రాజ్యాంగ నిర్మత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనతో భైంసాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళిత సంఘాల ఆందోళనల నేపథ్యంలో భైంసాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. శాంతి భద్రతల దృష్ట్యా బంద్ పాటించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.