
నిర్మల్: జిల్లాలో చిరుతల సంచారం కలకలంరేపుతోంది. సారంగపూర్ మండలం, బీరవెల్లి శివారు అటవీ ప్రాంతంలో తిష్ట వేసిన మూడు చిరుత పులులు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. చిరుతలు నిత్యం పంటపొలాల్లో సంచరిస్తుండడంతో బావుల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. బుధవారం రాత్రి బావుల వద్దకు వెళుతున్న రైతులకు చిరుత కంటపడడంతో భయంతో పరుగులుపెట్టారు.