నిర్మల్: కడెం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 72,151 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 73,002 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 697.800 అడుగులుగా ఉంది.