TS News: తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా ఉంది: నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2022-09-04T00:02:14+05:30 IST

Hyderabad: తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా 60 శాతం ఉందని, కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు ప్రధాని ఫొటో ఎందుకు పెట్టరని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Seetaraman) సూటిగా ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల ఆమె రెండు రోజులు పర్య

TS News: తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా ఉంది: నిర్మల సీతారామన్

Hyderabad: తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా 60 శాతం ఉందని,  కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు ప్రధాని ఫొటో ఎందుకు పెట్టరని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Seetaraman) సూటిగా ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల ఆమె రెండు రోజులు పర్యటించారు. రేషన్ కార్డు దారులకు కేంద్రం కూడా ఉచితంగా ఇస్తున్నపుడు రేషన్ దుకాణాల్లో ప్రధాని (PM Modi) ఫొటో పెట్టకపోవడంపై ఆమె కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కామారెడ్డి పర్యటన ముగిశాక ఆమె హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో మంత్రి హరీష్ రావు (Harish Rao) వ్యాఖ్యలకు నిర్మల సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రానికి ఇస్తున్న నిధుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రథమంలో ఉందని, ఆ నిధులను వాడుకుంటున్న రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ ఫొటో పెడుతున్నారా?  అని హరీష్ రావు ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ..‘తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా 60 శాతం ఉంది. ఆదిలాబాద్‌లో ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎంపీ ఫొటో పెట్టి ప్రచారం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకున్నప్పుడు ప్రధాని పేరు ఎందుకు పెట్టరు? అని ప్రశ్నించారు.


తెలంగాణపై ఏ వివక్ష లేదు..

‘‘ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నాం.  నిధులను పక్కదారి పట్టించకుండా డిజిటలైజేషన్ చేశాం. ఈ రాష్ట్రానికి ఎక్కువ, ఆ రాష్ట్రానికి తక్కువ ఇవ్వడం ఉండదు. రాష్ట్రాల పన్నును నిర్ణయించేది ఫైనాన్స్ కమిషన్.. నా చేతుల్లో ఏమీ ఉండదు. కేంద్రం వసూలు చేసే సెస్‌లు తిరిగి రాష్ట్రాలకే వెళతాయి. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు అవాస్తవం’’ అని స్పష్టం చేశారు.


‘‘ఆ అప్పులు భారం ప్రజలు భరించాల్సిందే.’’

‘‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదు?. తెలంగాణ ఆదాయంలో 55% వాటా హైదరాబాద్ నుంచే వస్తోంది. జిల్లాల పర్యటనలో చాలా విషయాలు తెలుసుకున్నాను. రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాం. తెలంగాణలోని ప్రతి స్కీంలో కేంద్రం వాటా ఉంది.కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం చేసిన అప్పులు బారం ప్రజలు భరించాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు తెలియజేసే బాధ్యత మాపై ఉంది. ఎవర్ని రాజీనామా చేయించాలో .. ఎవర్ని ఇంటికి పంపించాలో ప్రజలకు తెలుసు. మంత్రుల వ్యంగ్యస్త్రాలకు ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా తెలంగాణలో తరచూ పర్యటిస్తాను. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు.మరో రెండు మూడ్లు సార్లు తెలంగాణలో పర్యటించాలని నిర్ణయించుకున్నాను.’’ అని చెప్పారు.



Updated Date - 2022-09-04T00:02:14+05:30 IST