Budget 2022 : తపాలా కార్యాలయాలన్నీ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి

ABN , First Publish Date - 2022-02-01T17:14:40+05:30 IST

దేశవ్యాప్తంగా నూటికి నూరు శాతం తపాలా కార్యాలయాలు

Budget 2022 : తపాలా కార్యాలయాలన్నీ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నూటికి నూరు శాతం తపాలా కార్యాలయాలు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. తపాలా కార్యాలయాలు ఆర్థిక సమ్మిళితత్వంలో భాగస్వాములవుతాయన్నారు. విశ్వాస ఆధారిత పరిపాలన కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట లభించే విధంగా కృషి చేస్తామన్నారు.


ఈ-పాస్‌పోర్టుల జారీ 2022లో ప్రారంభమవుతుందన్నారు. దీంతో ప్రయాణాలు సులభతరం అవుతాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ప్రారంభమవుతుందన్నారు. 


టైర్ 2, టైర్ 3 నగరాలకు మరిన్ని నిధులను కేటాయించి, అభివృద్ధి చేస్తామన్నారు. హై లెవెల్ అర్బన్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభిస్తామని చెప్పారు. 2047 నాటికి దేశంలో సగం జనాభా నగరాల్లోనే ఉంటుందని, నగరాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. 


ఈ-వెహికిల్స్ కోసం బ్యాటరీ స్వాపింగ్ పాలసీని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తామని తెలిపారు. ప్రజా రవాణా పర్యావరణ హితంగా మారడానికి ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు చెప్తున్నారు. 


Updated Date - 2022-02-01T17:14:40+05:30 IST