సాంకేతిక ఫలాలు సామాన్యుల దరిచేరాలి

ABN , First Publish Date - 2021-03-01T05:01:39+05:30 IST

సాంకేతిక ఫలాలు సామాన్యుల దరిచేరాలి

సాంకేతిక ఫలాలు సామాన్యుల దరిచేరాలి
మాట్లాడుతున్న నిట్‌ పూర్వ సంచాలకులు ఆచార్య చిదంబరం

న్యూశాయంపేట, ఫిబ్రవరి 28 : శాస్త్ర, సాంకేతిక  ఫలాలు సామాన్య ప్రజల దరిచేరాలని నిట్‌ పూర్వ సంచాలకులు ఆచార్య చిందంబరం అన్నారు. ఆదివారం జనవిజ్ఞాన వేదిక అర్బన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆచార్యా ఆంజనేయులు అధ్యక్షతన స్పెకో్ట్ర గ్లోబల్‌ కాన్సెప్ట్‌ స్కూల్లో జాతీయ సైన్స్‌ దినోత్సవం, జనవిజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిదంబరం హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, వాటి ఫలాలు సామాన్య మానవాళికి చేరడం లేదని అన్నారు. కారణం ప్రజల్లో ప్రశ్నించే తత్వం, సైన్స్‌ దృక్పథంతో జీవించే తత్వం లేకపోవడమేనని అన్నారు. అందుకే విద్యార్థులు హేతుబద్ధమైన, ఆలోచనలతో చక్కటి క్రమశిక్షణతో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అటవీ అధికారి పురుషోత్తం, డాక్టర్‌ రాములు, జనవిజ్ఞాన వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:01:39+05:30 IST