నీతి ఆయోగ్ హెచ్చరిక: త్వరలో రోజుకు 4 లక్షల కరోనా కేసులు... 2 లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధం చేయండి!

ABN , First Publish Date - 2021-08-23T15:20:17+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి మరోమారు...

నీతి ఆయోగ్ హెచ్చరిక: త్వరలో రోజుకు 4 లక్షల కరోనా కేసులు... 2 లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధం చేయండి!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోమారు తన వికృతరూపం చూపనుంది.  నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా)తాజాగా కరోనా థర్డ్ వేవ్‌పై హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అప్పుడు కరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయని అంచనా వేసింది. 


అందుకే ఈ పరిస్థితులకు ముందుగానే దేశంలో రెండు లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం... రానున్న కరోనా దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే అప్రమత్తమవుతూ, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని సూచింది. 2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్ కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ బెడ్లు సిద్ధం చేయాలని సూచించింది. నీతి ఆయోగ్ దీనికి ముందుగా 2020 సెప్టెంబరులో కరోనా సెకెండ్ వేవ్ గురించి హెచ్చరించింది. ఈసారి కూడా థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. కాగా దేశంలో గడచిన 56 రోజులుగా 50 వేలకు దిగువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గడచిన 24 గంటట్లో దేశంలో కొత్తగా 30,948 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 403 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 4 లక్షల 34 వేల 367కు చేరింది. 

Updated Date - 2021-08-23T15:20:17+05:30 IST