Raj Thackeray ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2022-04-04T15:57:29+05:30 IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్ర నవనిర్మాణసేన అధినేత రాజ్ థాకరేను ముంబైలోని రాజ్ థాకరే నివాసంలో కలిశారు....

Raj Thackeray ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

ముంబై: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్ర నవనిర్మాణసేన అధినేత రాజ్ థాకరేను ముంబైలోని రాజ్ థాకరే నివాసంలో కలిశారు.రాజ్ థాకరేతో తన సమావేశం వెనుక ఎలాంటి రాజకీయం లేదని మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ కుటుంబంతో తనకు పాత అనుబంధం ఉందని, ఆయన ఆహ్వానం మేర ఆయన ఇంటికి వెళ్లానని మంత్రి వివరించారు.‘‘ఇది రాజకీయ సమావేశం కాదు. రాజ్ ఠాక్రే, అతని కుటుంబ సభ్యులతో నాకు 30 సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉంది. నేను అతని కొత్త ఇల్లు చూడటానికి, అతని తల్లి యోగక్షేమాలను తెలుసుకోవడానికి వచ్చాను. ఇది కుటుంబ పర్యటన, రాజకీయం కాదు.’’ అని గడ్కరీ చెప్పారు.


మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాజ్ థాకరే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరగడం గమనార్హం.‘‘నేను ప్రార్థనలకు వ్యతిరేకం కాదు, మీరు మీ ఇంట్లో ప్రార్థనలు చేసుకోవచ్చు, కానీ మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లౌడ్ స్పీకర్లను తొలగించాలని కోరుతున్నాను. మసీదు ముందు లౌడ్ స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా వాయించండి’’ అని ముంబైలో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి రాజ్ థాకరే అన్నారు.


Updated Date - 2022-04-04T15:57:29+05:30 IST