Nitish Kumar expands Bihar cabinet: బీహార్‌లో 31 మంది మంత్రులు ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2022-08-16T18:05:09+05:30 IST

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar expands) మంగళవారం తన మంత్రివర్గాన్ని( Bihar cabinet) విస్తరించారు....

Nitish Kumar expands Bihar cabinet: బీహార్‌లో 31 మంది మంత్రులు ప్రమాణస్వీకారం

పాట్నా (బీహార్): బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar expands) మంగళవారం తన మంత్రివర్గాన్ని( Bihar cabinet) విస్తరించారు. జనతాదళ్ (యునైటెడ్)(Nitish Kumar's JDU) అధినేత నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక రాష్ట్రీయ జనతాదళ్ తో చేతులు కలిపి 8వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రీయ జనతాదళ్ కు( Rashtriya Janata Dal leader)చెందిన తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 


కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, జితిన్ రాం మాంఝీకి చెందిన హిందుస్తానీ అవాం మోర్చాకు చెందిన ఒక ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణం చేశారు. ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, అలోక్ మెహతా, రామానంద్ యాదవ్, సురేంద్రప్రసాద్ యాదవ్, లలిత్ కుమార్ యాదవ్, జేడీ(యూ) నుంచి విజయ్ చౌదరి, బిజేంద్ర యాదవ్, అశోక్ చౌదరి, శ్రవణ్ కుమార్, లేషి సింగ్ మదన్ సహాని, ఆఫ్ఖాక్ ఆలంలు మంత్రులుగా ప్రమాణం చేశారు.


Updated Date - 2022-08-16T18:05:09+05:30 IST