Bihar trust vote: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్ సంకీర్ణ సర్కారు... ఇక 2024పై ఫోకస్

ABN , First Publish Date - 2022-08-24T23:52:16+05:30 IST

పాట్నా: బీహార్‌లో నితీశ్ సారధ్యంలోని సంకీర్ణ సర్కారు విశ్వాస పరీక్ష నెగ్గింది. మొత్తం 160 మంది ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కారుకు మద్దతిచ్చారు.

Bihar trust vote: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్ సంకీర్ణ సర్కారు... ఇక 2024పై ఫోకస్

పాట్నా: బీహార్‌లో నితీశ్ సారధ్యంలోని సంకీర్ణ సర్కారు విశ్వాస పరీక్ష నెగ్గింది. మొత్తం 160 మంది ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కారుకు మద్దతిచ్చారు. విశ్వాస పరీక్ష వేళ బీహార్ అసెంబ్లీలో బీజేపీ విధానాలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శించారు. బీజేపీ హిందూ-ముస్లింల అంశం తీసుకొస్తోందని, ఇది సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2024లో బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలన్నీ కలిసివచ్చి మద్దతిచ్చినందుకు నితీశ్ ధన్యవాదాలు తెలిపారు. 





విశ్వాస పరీక్ష సమయంలో మాట్లాడిన బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు పిరికిపందలని అందుకే సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక తనను బద్నాం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నాలు ముమ్మరం చేస్తుందని ఆయన చెప్పారు.  



బీహార్ అసెంబ్లీలో తమపై నితీశ్, తేజస్వీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. 


బీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీశ్ ఆగస్ట్ 10న ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశారు. నితీశ్ సీఎంగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా మొత్తం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆర్జేడీకి 16, జేడీయూకు 11 మంత్రిపదవులు దక్కాయి. 



Updated Date - 2022-08-24T23:52:16+05:30 IST