అన్నదాతల ఆశలపై నీళ్లు

ABN , First Publish Date - 2020-11-29T05:40:37+05:30 IST

రైతుల ఆశలపై నివర్‌ తుపాను నీళ్లు చల్లింది. మొన్నటి కురిసిన భారీ వర్షాలతో పంటలకు కోలుకోలేని దెబ్బ తగిలిన అన్నదాతను ఇప్పుడు నివర్‌ తుపాన్‌ నట్టేట ముంచింది.

అన్నదాతల ఆశలపై నీళ్లు
పెద్దవూర: తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతులు

పెద్దవూర, నవంబరు 28: రైతుల ఆశలపై నివర్‌ తుపాను నీళ్లు చల్లింది. మొన్నటి కురిసిన భారీ వర్షాలతో పంటలకు కోలుకోలేని దెబ్బ తగిలిన అన్నదాతను ఇప్పుడు నివర్‌ తుపాన్‌ నట్టేట ముంచింది. మండ లంలో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఎఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలోని గ్రామాలతో పాటు, పెద్దగూడెం, చిన్నగూడెం, శిర్శనగండ్ల, బట్టుగూడెం పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి చేళ్లు నేలకొ రిగాయి. కూలీల కొరతతో చేలల్లో మిగిలిన పత్తి నివర్‌ ముసురుకు తడిసి మొల కెతుత్తున్నాయి. చేతికొచ్చిన పంట ఽధాన్యాన్ని విక్రయించడానికి అన్నదాతలు నానాకష్టాలు పడుతున్నారు. తేమ శాతం అధికంగా మార్కెట్‌కు తీసుకవచ్చిన ధాన్యాన్ని కోనుగోలు చేయడం లేదు. నివర్‌ తుపాన్‌కు పంట దిగుబడులను కాపాడుకునేందుకు తపన పడుతున్నా రు. మార్కెట్‌కు వచ్చిన ఽధాన్యం రాశులపై టార్పాలిన్‌ పట్టాలు కప్పిన, ధాన్యం కుప్పల కింద వర్షపు నీరు చేరి తడిసి ముద్దై మొలకెతుత్తు న్నాయి. పెద్దవూర సబ్‌మార్కెట్‌ యార్డులో సుమారు 250నుంచి 300 బస్తాలకు సరిపోను ధాన్యం రాశులు ఉన్నాయి. ఇలా పోసిన ధాన్యం కుప్పలన్నీ వర్షాలకు తడిసిపోయాయి.  ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన తమ ధాన్యాన్ని కోనుగోలు చేయాలని వేడుకొంటున్నారు.

తడిసిన ధాన్యం రాశులు 

మునుగోడు : మునుగోడు నియోజవకర్గం పరిధిలో నివర్‌ తుపాను ప్రభావం పడింది. మూడు రోజులుగా కురిసిన వర్షం కారణంగా చేతికొచ్చిన పత్తి, ధాన్యం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా మార్కెట్‌లకు అమ్మకానికి తెచ్చిన పంటలు తడిసిపోవటంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. మునుగోడు మండలకేంద్రంలోని సబ్‌ మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రానికి అమ్మకానికి తీసుకొచ్చిన రైతులు ధాన్యం రాశులపై ముందస్తుగా పట్టాలు కప్పిఉంచారు. అయినా వర్షం నీరు పారిన కారణంగా రాశులు పూర్తిగా తడిసిపోయాయి మొల కెత్తటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టెందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇంత జరిగినా అధికారులు మాత్రం కన్నెత్తిచూడడం లేదని రైతుల ఆరోపిస్తున్నారు.

పాడైన పత్తి చేలు

చండూరు: నివర్‌ తుపానుతో పత్తి చేనులు పాడై పోయాయి. ఈ వర్షానికి తడిసిన వరి, పత్తిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు  రావడంలేదు. ఇంకా రెండు తుపానులు ఉన్నాయనే వార్త రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. అధికారులు స్పందించి గ్రామాల్లో తిరిగి పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందేలా చూడాలని రైతు సంఘం నియోజకవర్గ కన్వీనర్‌ మందడి నర్సింహారెడ్డి కోరారు. అంతకుముందు కురిసిన వర్షాలకు మండలంలో 1600 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని ఏఓ మల్లేశం తెలిపారు. ఇప్పుడు కూడా పంట నష్టంపై గ్రామాలనుండి సమాచారం తెప్పించుకుంటున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-11-29T05:40:37+05:30 IST