నట్టేట ముంచిన ‘నివర్‌’

ABN , First Publish Date - 2020-11-29T04:33:00+05:30 IST

నివర్‌ తుఫాన్‌ అన్నదాతను నట్టేట ముంచింది. పంటను కాపాడుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. నష్టం తప్పడం లేదు.

నట్టేట ముంచిన ‘నివర్‌’
మొలకెత్తిన పంటను చూపిస్తున్న రైతులు

శృంగవరపుకోట/ శృంగవరపుకోట రూరల్‌ :

నివర్‌ తుఫాన్‌ అన్నదాతను నట్టేట ముంచింది. పంటను కాపాడుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. నష్టం తప్పడం లేదు.  తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో చాలా వరకు వరి పంట నీట మునిగింది. చాలా చోట్ల కోసిన వరి పనలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.  మరికొన్ని చోట్ల మొలకలు వచ్చేశాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు నిట్టూరుస్తున్నారు. ఇదిలా ఉండగా విపత్తులను తట్టుకోలేని 1121 విత్తనాన్ని ప్రభుత్వం అంటగట్టి మరింత నష్టాల్లోకి తోసేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడం యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


 

 

Updated Date - 2020-11-29T04:33:00+05:30 IST