నివర్‌.. షివర్‌

ABN , First Publish Date - 2020-11-28T06:33:05+05:30 IST

జిల్లాలోని ప్రజలను నివర్‌.. ఫీవర్‌ పట్టుకుంది. ఈ ప్రభావంతో రెండ్రోజులుగా ముసురుతో పంట చేలు కోయని, కోసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నివర్‌.. షివర్‌
కొండమల్లేపల్లి మార్కెట్‌కు రైతులు తెచ్చిన ధాన్యం

దేవరకొండ, నవంబరు 27 : జిల్లాలోని ప్రజలను నివర్‌.. ఫీవర్‌ పట్టుకుంది. ఈ ప్రభావంతో రెండ్రోజులుగా ముసురుతో పంట చేలు కోయని, కోసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముసురు ప్రభావంతో ప్రజలు సైతం ఇళ్లకే పరిమితమవుతున్నారు. దేవరకొండ డివిజన్‌లోని ఏఎమ్మార్పీ, డిండి ప్రాజెక్టుల ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతులు తుఫాన్‌తో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంవత్సరం శ్రీశైలం ఎగువ భాగంతో పాటు జూరాల, కల్వకుర్తి ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరడంతో డిండి, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు నిండాయి. దీంతో డిండి ఆయకట్టు కింద 12 వేల ఎకరాలు, ఏఎమ్మార్పీ ఆయకట్టు కింద 25వేల ఎకరాల వరకు వరి పంటను రైతులు సాగుచేశారు. ఇప్పటివరకు డిండి ఆయకట్టు కింద 6వేల ఎకరాల వరకు ఏఎమ్మార్పీ కింద 10వేల ఎకరాల వరకు వరి పంటలు కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. డిండి ఆయకట్టు కింద 6వేల హెక్టార్లు, ఏఎమ్మార్పీ ఆయకట్టు కింద 15వేల ఎకరాలకు పైగా వరి పంట కోయడానికి సిద్ధంగా ఉంది. వరిపంట చేతికొచ్చే సమయంలో తుఫాన్‌తో వరి పంట నేలకు ఒరుగుతుందని, ఇలాగే రెండు, మూడు రోజులు వర్షం ఉంటే చేతికి అందివచ్చిన వరి పంట నెలకొరిగి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఏపల్లి, డిండి, కొండమల్లేపల్లి మండలాల్లో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పుడిప్పుడే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఐకేపీ కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని త్వరత్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వరికోతల్లో జాప్యానికి యంత్రాల కొరత సైతం కారణమని రైతులు తెలుపుతున్నారు. దేవరకొండ డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల్లో వర్షం ముసురుకుంది. వర్షానికి దేవరకొండలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై దేవరకొండ ఏడీఏ విజేందర్‌రెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఇప్పటికే 50శాతం వరి కోతలు పూర్తవుతున్నట్లు తెలిపారు. ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధర అందించి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. 
నివర్‌తో రైతన్న బేజార్‌
పెద్దవూర / చండూరు / మునుగోడు రూరల్‌ / చిట్యాల రూరల్‌ : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దవూర మండల రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే కోతలకు సిద్ధంగా ఉన్న పంటలు, చేతికొచ్చిన ధాన్యం, పత్తి, మిర్చి రైతులు బేజారవుతున్నారు. అమ్మకానికి మార్కెట్‌కు వచ్చిన ధాన్యం కొనుగోలు కాకపోవడంతో చేసేదేమి లేక ఆ కుప్పలపై పట్టాలను కప్పి భద్రపరిచినా రాసుల కిందికి నీరు చేరి మొలకెతుతున్నాయని రైతులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల కోతలు కోయకుండా ఉన్న వరి చేలల్లో వర్షానికి ధాన్యం గింజలు రాలి మొలకెతుతున్నాయని అలాగే ఈదురుగాలులలకు వరిచేలు పడిపోతుండగా, మరో వైపు పత్తి చేలల్లో ఉన్న కొద్దిపాటి పత్తి పంట దెబ్బతింటుందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు రోజులు తుఫాన్‌ ప్రభావం ఉందని వాతావరణ శాఖ వారు హెచ్చరించడంతో ఇక చేలలో పంట తమకు దక్కడం కష్టమేనని వారు నిట్టూరుస్తున్నారు. వ్యవసాయ, మార్కెట్‌ శాఖ అధికారులు పంట కోతలు నిలిపివేయాలని, కోసిన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకరావొద్దని ఆదేశాలు జారీ చేయడంతో రైతు లు మరింత దిగులుపడుతున్నారు. చం డూరు మండలంలో రైతులది సైతం ఇదే పరిస్థితి. మండలంలో శుక్రవారం సంత కాగా కూరగాయాలు, ఇతర వస్తువులను విక్రయించేందుకు వచ్చిన వారు ఏమాత్రం అమ్మకాలు లేక వాటిని తిరిగి తీసుకెళ్లారు. మునుగోడు మండలంలో సైతం ముసురుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిట్యాల మండలంలో ముసురుతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యాహ్నం వేళ చిమ్మ చీకట్లకు క మ్ముకోగా జాతీయ రహదారిపై వాహనాలు లైట్ల వెలుతురులో వెళ్లడం కనిపించింది.
మూడు రోజుల పాటు పత్తి కొనుగోలు నిలిపివేత
మిర్యాలగూడ రూరల్‌ : మిర్యాలగూడ మండలంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, మిర్యాలగూడ పరిధిలోని గురులక్ష్మి, ఎన్‌వీఆర్‌ కాటన్‌ జిన్నింగ్‌ మిల్లుల్లో  పత్తి కొనుగోళ్లు మూడు రోజుల పాటు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిల్లుల్లో భారీగా పత్తి నిల్వలు పేరుకపోవడం, నివార్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షం వ స్తున్నందున రైతులు పత్తిని ఇంటి వద్ద ఉంచుకోని వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తిరిగి మంగళవారం రోజు కొ నుగోళ్లు ప్రారంభం అవుతాయని, ఈ విషయాన్ని రైతులు గ్రహించాలని సూచించారు.
ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తాం
కొండమల్లేపల్లి : రైతులు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని ఏవో విజయ్‌రెడ్డి, డీటీ బుచ్చిబాబు అన్నారు. శుక్రవారం వారు కొండమల్లేపల్లి మార్కెట్‌ యార్డులో రైతులతో మా ట్లాడారు. పీఏపల్లి, పెద్దవూర, నేరేడుగొమ్ము, చందంపేట, దేవరకొండ నుంచి అధిక మొత్తంలో ధాన్యం మార్కెట్‌కు రావడంతో నిల్వ ఉంద ని, దాంతోపాటు సెలవులు రావడంతో ఆలస్యం జరిగిందన్నారు. సన్నధాన్యం కొనుగోలుకు రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. 17శాతంలోపు తేమ ఉన్న ధాన్యా న్ని పూర్తిగా కొనుగో లు చేస్తామని తెలిపారు. ఇప్పటికి రైతుల నుంచి 3788 క్వింటాళ్ల ధా న్యం కొనుగోలు చేశామని సీఈవో తిరుపతిరెడ్డి తెలిపారు. కాగా రైతు లు తేమశాతం అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని డిమాం డ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఈవో సురే్‌షబాబు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T06:33:05+05:30 IST