నిలువునా ముంచిన ‘నివర్‌’

ABN , First Publish Date - 2020-11-30T04:41:40+05:30 IST

ధరలు లేక ఇబ్బంది పడే రైతన్నను ‘నివర్‌’ నిలువునా ముంచెత్తిం ది. మండలంలో సుమారు 1100 ఎకరాల్లో పంట నీట ముని గిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నిలువునా ముంచిన ‘నివర్‌’
ఉధృతంగా పెద్ద చెరువు అలుగు

- నీట మునిగిన 1100 ఎకరాల పంట

- ఇంటి వద్దకే వెళ్లి ఈ - క్రాప్‌ నమోదు : అధికారులు

బద్వేలు/బద్వేలు రూరల్‌, నవంబరు 29: ధరలు లేక ఇబ్బంది పడే రైతన్నను ‘నివర్‌’ నిలువునా ముంచెత్తిం ది. మండలంలో సుమారు 1100 ఎకరాల్లో పంట నీట ముని గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బద్వేలు పెద్దచెరువు అలుగుపారుతుండడంతో వంద ల    ఎకరాల్లో వరిపంట పూర్తిగా మునిగిపోయింది. 1200 ఎకరాల్లో ఈదురు గాలులతో పంట నేలకొరిగిం ది. ఇంతటి భారీ నష్టం తామెప్పుడూ చూడలేదని చెరువు ఆయకట్టు పరిధి గ్రామాల రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ. 20వేలు ఖర్చు అయ్యిందని, పంట కోసి ఉంటే ఎకరాకు రూ.40వేలు వచ్చేదని రైతులు వివరిస్తున్నారు. వివరాల్లోకెళితే... 

 ఎనిమిదేళ్లగా చెరువులో చుక్క నీరు లేక ఎండిపోవడంతో బోరుబావులు బావురుమంటున్నాయి. అయితే ఇటీవల సకాలంలో వర్షాలు కురవడం, చెరువులు నిం డడంతో రైతులు పంటలు సాగుచేశారు. పంట చేతికి వచ్చే దశలో నివర్‌ తుఫాను కారణంగా భారీగా వర్షా లు కురిసి వాగులు, వంకలు చెరువు అలుగు పొంగి పొర్లి కంటి ముందే కోతకు వచ్చిన పంట నీట మునిగిపోతోంది. చంటి బిడ్డలా పెంచుకున్న పంటను చేతి కి వచ్చే దశలో పంట నీట మునగడంతో అన్నదాత రైతన్న పడుతున్న ఆవేదన వర్ణణాతీతం. 18 ఏళ్లగా నిండని పెద్దచెరువు సంపూర్ణంగా నీరు చేరడంతో బద్వేలు పెద్దచెరువు ఆయకట్టు కింద 1100 ఎకరాల పంట సాగుచేశారు. పంటలు కోతకొచ్చి ఒకటి రెండ్రోజుల్లో కోతలు కోసుకుందామన్న దశలో నివర్‌ తుఫా ను వల్ల పంట నీటమునిగింది. పెద్దచెరువు ఆయకట్టు కింద అధికారికంగా దాదాపు 4వేల ఎకరాలు ఆయకట్టు భూమి ఉండగా, పదివేల ఎకరాల వరకూ సాగు చేస్తున్నారు. కోత దశలో ఉన్న సమయంలో నివర్‌ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురవడంతో పెద్దచెరువు సంపూర్ణంగా నిండి అలుగు పారుతోంది. దీంతో లక్ష్మిపాళెం, కొండ్రాజుపల్లె, గుండంరాజుపల్లె,   విజయపురం, తిమ్మరాజుపల్లె, తిరువెంగళాపురం, రఘునాథపురం, గుంతపల్లెల్లోని పంట పొలాల్లో ఎటు చూసినా నీటితో పంట పొలాలు మునిగిపోయాయి. 

ఈ-క్రాప్‌ నమోదు జాప్యంతో నష్టం

మండల పరిధిలో కొన్ని గ్రామాలు, మున్సిపల్‌ పరిధిలో కొంత మేర పంట పొలాలకు ఈ-క్రాప్‌ (పంట నమోదు) చేయడం ఆలస్యం కావడంతో వందలాది ఎకరాలు అధికారుల గణాంకాల్లోకి చేరలేదు. దీంతో రైతు పంట పండించినా ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోలేడు. అలాగే ప్రభుత్వం ద్వారా పంట నష్టం పొందేందుకు కూడా  అనర్హుడని చెప్పవచ్చు. దీంతో రైతులు సంబంధిత అధికారులు తమ పంటలను ఈ క్రాప్‌ను ఆనలైన చేయాలని కోరుతున్నారు.


నష్టం నివేదికలు పంపాం


 నివర్‌ తుఫాను కారణంగా మండల పరిధిలో నీట మునిగిన పంట నష్టం వివరాలు నమోదు చేసి నివేదికలను ఉన్నతాధికారులకు పంపాం. ఈ-క్రాప్‌ (పంట నమోదు) చేయించుకోని రైతుల కోసం ఆదివారం నుంచి గ్రామాలకే వెళ్లి వారి వివరాలు నమో దు చేస్తున్నాం. దాదాపు 1100 ఎకరాలు నీట మునిగినట్లు గుర్తించాం. 

 - ప్రసాద్‌రెడ్డి, బద్వేలు వ్యవసాయాధికారి


కలసపాడు మండలంలో 

కలసపాడు, నవంబరు 29: మండలంలో ‘నివర్‌’తో రైతన్న పంట నష్టపోయి ఆర్ధికంగా అప్పులపాలయ్యా డు. 13 పంచాయతీల్లో దాదాపు 20వేల హెక్టార్ల భూ మి ఉంది. అధికారుల లెక్కల ప్రకారం 4500 హెక్టార్ల భూమి మాత్రమే సాగులో ఉంది. దీంట్లో ఖరీఫ్‌ 1110 ఎకరా లు, రబీలో 400 ఎకరాలు వరి సాగు చేశారు. కంది 290 ఎకరాలు, జొన్న 200 ఎకరాలు సాగు చేశా రు. అనధికారిక లెక్కల ప్రకారం కంది వెయ్యి ఎకరా లు, జొన్న 3వేల ఎకరాలు సాగు చేశారు. వరుస వర్షాలతో అన్ని పంటలు నీటిలో నాని కుళ్లిపోయాయి. ప్రస్తుతం దాదాపు వరి అయితే వంద శాతం పంట నష్టపోయినట్లే. మిగతా పంటలు రాబోయే రోజుల్లో వర్షం తెరపినిస్తే కొద్దో గొప్పో దిగుబడి వచ్చే అవకా శం ఉంది. ప్రస్తుతం జొన్న పంటకు ఈక్రాప్‌ జరగకపోవడంతో నష్టపోయిన ప్రభుత్వం నుంచి వచ్చే సహా యం ఏ మాత్రం పొందే అవకాశం లేదు. ముఖ్యంగా  ఎగువరామాపురం, ఎగువతంబళ్లపల్లె, లింగారెడ్డిపల్లె గ్రామాల్లో ఎక్కువ శాతం జొన్న సాగు చేశారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ లేకపోవడంతో ఈ పంటకు నష్టపరిహారం పొందే అవకాశం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిశీలించి పంట నష్ట నమోదులో స్థానిక నేతల వత్తిళ్లు లేకుండా చేయాలని రైతన్నలు కోరుతున్నారు.





Updated Date - 2020-11-30T04:41:40+05:30 IST