నివర్‌ .. షివర్‌

ABN , First Publish Date - 2020-11-27T05:39:03+05:30 IST

నివర్‌ తుఫాన్‌ జిల్లాలో బీభత్సం సృష్టి స్తోంది. బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఏకధాటిగా కురు స్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది.

నివర్‌ .. షివర్‌
పెన్నాడలో నిండా మునిగిన వరిచేలు చూపుతున్న రైతు

 వణికించిన వాన ..చలి

 3,175 హెక్టార్లలో నేలకొరిగిన వరి 

 కళ్లాల్లోనే తడిచి ముద్దయిన ధాన్యం

 కోలుకోలేని దెబ్బ.. అన్నదాతల ఆక్రందన

 పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఇళ్లల్లోనే జనం


ఏలూరు సిటీ/ రూరల్‌/ పాలకోడేరు/ తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 26: నివర్‌ తుఫాన్‌ జిల్లాలో బీభత్సం సృష్టి స్తోంది. బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఏకధాటిగా కురు స్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు జిల్లాలో 3,195 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయి. కోసిన వరిపనలు చేలమీదే ఉండి పోవడంతో తడిసి ముద్దయ్యాయి. ఆర బెట్టిన ధాన్యం వర్షం పాలైంది. పంట కోతకొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో చేతికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని రైతులు వాపోతు న్నారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆచంట, యలమంచిలి, మొగల్తూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, భీమవరం, కొవ్వూరు, నల్లజర్ల, భీమడోలు, ఏలూరు, పెదపాడు, ఆకివీడు తదితర ప్రాంతాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయి. 3,175 హెక్టార్లలో వరి, 13 హెక్టార్లలో మినుము, ఏడు హెక్టార్లలో ప్రత్తి దెబ్బ తిన్నట్టు వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగం తెలిపా రు. జిల్లాలో ఇప్పటి వరకు 94,292 హెక్టార్లలో వరి మా సూళ్లు పూర్తయ్యాయన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదు ర్కొనేందుకు కంట్రోల్‌ రూమ్‌ లు ఏర్పాటు చేశారు. 


24 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు 

చలిగాలుల కారణంగా పగటి ఉష్ణోగ్ర తలు 10 డిగ్రీల వరకు పడిపోయాయి. గురువారం పగటి ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్ర తలు 20 నుంచి 22 వరకు ఉంటాయని చెబుతున్నారు.  ఎన్నడూ లేనివిధంగా  చలి తీవ్రత ఇంత ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఎడతెరపి లేని వర్షంతో ప్రజలు బయటకు రాలేదు. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే వచ్చారు. వర్షంతో వివిధ ప్రాంతాల్లో పల్లపు ప్రాం తాలు జలమయమయ్యాయి. రోడ్లు ఛిద్రమయ్యాయి.

 

పోడూరులో అత్యధిక వర్షపాతం

గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా పోడూరు మం డలంలో 38.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మొత్తం వర్షపాతం 601 మి.మీ నమోదు కాగా సరాసరి వర్షపాతం 12.5 మి.మీ నమోదైంది. మొగల్తూరులో 36.4, యలమంచి లిలో 35.2, పాలకొల్లులో 33.2, వీరవాసరంలో 29.8, పెను గొండలో 29.6, నరసాపురంలో 29.4, పెనుమంట్రలో 28.4, ఇరగవరంలో 24.2, పాలకోడేరులో 21.6, భీమవరంలో 21.2, పెరవలిలో 19, గణపవరంలో 18.2, ఉండిలో 17.2, తణుకులో 17, ఉండ్రాజవరంలో 14.6, అత్తిలిలో 14.4, నిడమర్రులో 14.2, కాళ్లలో 13.8, పెంటపాడులో 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

కలెక్టరేట్‌ టోల్‌ఫ్రీ నెంబరు      : 1800–233–1077

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, నరసాపురం     : 08814–276699

ఆర్డీవో కార్యాలయం, ఏలూరు              : 08812–232044

ఆర్డీవో కార్యాలయం, కొవ్వూరు              : 08813–231488

ఆర్డీవో కార్యాలయం, కుక్కునూరు      : 08821–232221

ఆర్డీవో కార్యాలయం, జంగారెడ్డిగూడెం      : 08821–223660

తహసీల్దార్‌, నరసాపురం మండలం     : 08814– 275048

తహసీల్దార్‌, మొగల్తూరు మండలం      : 98669 51235


అప్రమత్తంగా ఉండాలి : మంత్రి నాని

నివర్‌ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేప థ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని జిల్లా అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతా ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కారణంగా వాగులు, వం కలు పొంగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అప్రమ త్తంగా ఉండాలన్నారు. కాజ్‌ వేల వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయా లని, ఎటువంటి పరిస్థి తులు ఎదురైనా ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉండా లన్నారు. 


మొత్తం ముంచేసింది :రాపాక ప్రకాశం, రైతు, పెన్నాడ, పాలకోడేరు

నాలుగు ఎకరాలు కౌలుకి తీసుకుని సాగు చేస్తున్నా. మొన్న వర్షాలకు పంట దెబ్బతింది.    ఎకరాకు 15 బస్తాలు కష్టమే అనుకున్నా. ఇప్పుడు ఈ తుఫాన్‌ మొత్తం తుడిచి పెట్టేసింది.. కోతకు వచ్చిన పంట మొత్తం నేలవాలింది. కోయడానికి అవకాశం లేదు. నివర్‌ నిండా ముంచేసింది.



Updated Date - 2020-11-27T05:39:03+05:30 IST