ఆ ఆరూ ‘సిహాసిత్తా’

ABN , First Publish Date - 2021-12-10T05:30:00+05:30 IST

మహా ప్రవక్త మహమ్మద్‌ చేసిన ప్రవచనాలు, ఆయన జీవిత కార్యాచరణ గురించి ఉన్న మౌఖికమైన ఉల్లేఖనాలను ‘హదీసులు’ అని అంటారు....

ఆ ఆరూ ‘సిహాసిత్తా’

మహా ప్రవక్త మహమ్మద్‌ చేసిన ప్రవచనాలు, ఆయన జీవిత కార్యాచరణ గురించి ఉన్న మౌఖికమైన ఉల్లేఖనాలను ‘హదీసులు’ అని అంటారు. లక్షలాది హదీసులను అనేకమంది హదీసువేత్తలు సేకరించి, ఏర్చికూర్చి వందలాది గ్రంథాలు రాశారు. వారిటి ‘బుఖారీ’ (ఇమామ్‌ మహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బుఖారీ), ‘ముస్లిమ్‌’ (ఇమామ్‌ ముస్లిమ్‌ బిన్‌ హజ్జాజ్‌ కషీరి), ‘నసాయి’ (ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ షుఐబ్‌ నసాయి), ‘ఇబ్నెమాజ’ (ఇమామ్‌ మహమ్మద్‌ బిన్‌ యజీద్‌ బిన్‌మాజ), ‘తిర్మిజి’ (ఇమామ్‌ అబూ ఈసా తిర్మిజి), ‘అబూదావూద్‌’ (అబూదావూద్‌ అష్‌అస్‌ బిన్‌ సులైమాన్‌).. ఈ ఆరు గ్రంథాలను ‘సిహాసిత్తా’ అంటారు. అలాగే ‘ముస్నద్‌ అహ్మద్‌’ (ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌), ‘దారిమి’, ‘దారుఖ్తని’, ‘తబ్రాని’, ‘తహవీ’, ‘బైహాఖీ’, ‘ముస్కరక్‌ హకీమ్‌’, ‘ముస్తద్‌ రక్‌ హకీమ్‌’, ‘ముస్నద్‌ షాఫయి’, ‘ఇబ్నెజరీర్‌ తబ్రీ’, ‘కుతుబ్‌ ఖతీబ్‌ బగ్దాది’, ‘అబూనయీమ్‌’, ‘ఇబ్నె అసాకర్‌’, ‘వైలమి’, ‘పిర్దౌస్‌’, ‘కామిల్‌ ఇబ్నె అది’, ‘ఇబ్నెమర్తూయ’, ‘వాఖిది’ తదితర గ్రంథాలు కూడా ప్రఖ్యాతి చెందాయి. 

Updated Date - 2021-12-10T05:30:00+05:30 IST