‘పంచ గంగలు’ అంటే..?

Published: Fri, 10 Dec 2021 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పంచ గంగలు అంటే..?

మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ప్రతి నదికీ తనదైన విశిష్టత ఉంది. అయితే వీటన్నిటిలోనూ అయిదు నదులు అత్యంత పవిత్రమైనవిగా పరిగణనలో ఉన్నాయి. వాటిని ‘పంచగంగలు’ అని అంటారు. ఆ నదులు కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి లేదా గంగానది.  నిత్య పూజా సంకల్పంలో ‘కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీచ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః’ అనే శ్లోకం ఉంది. ఈ నదుల్లో గంగానది మినహా మిగిలినవన్నీ దక్షిణ భారతదేశంలోనే ప్రవహిస్తూ ఉండడం విశేషం. ఇవన్నీ పుష్కర నదులే. ఈ అయిదు నదుల్లో స్నానం చేయడం లేదా స్నానం చేస్తున్నప్పుడు వాటిని తలచుకోవడం పుణ్యప్రదమని శాస్త్రవచనం. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.