నిజాం సాగర్.. నిండుతోంది..

ABN , First Publish Date - 2020-10-15T16:25:20+05:30 IST

మూడు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు రావడంతో నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సింగూరు ప్రాజెక్టు వరద గేట్లను బుధవారం ఎత్తివేశారు. వరద గేట్ల ద్వారా భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో క్రమేపీ

నిజాం సాగర్.. నిండుతోంది..

యాసంగి, వానాకాలం.. సాగుకు ఢోకా లేదు  

ఏడాది ఖరీఫ్‌లో లక్షా 95 వేల ఎకరాల సాగు 

సంతోషం వ్యక్తం చేస్తున్న  ఉమ్మడి జిల్లా రైతులు


నిజాంసాగర్‌(ఆంధ్రజ్యోతి): మూడు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు రావడంతో నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సింగూరు ప్రాజెక్టు వరద గేట్లను బుధవారం ఎత్తివేశారు. వరద గేట్ల ద్వారా భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో క్రమేపీ నిజాంసాగర్‌ నీటి నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు యాసంగి, వానాకాలం సాగుకు ఢోకా లేదని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. నిజాం సాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 1405 అడుగులకు గాను 1399.00 అడుగులకు చేరు కుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో నిజాంసాగర్‌ ప్రాజెక్టు గురువారం ఉదయం వరకు నిండే అవకాశముంటుంది. సింగూరు ప్రాజెక్టులోకి 1,27,427 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో సింగూరు ప్రాజెక్టు వరద గేట్లలోని ఐదింటిని ఎత్తి వరద నీటిని మంజీరా ద్వారా నిజాంసాగర్‌ లోనికి విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోనికి పోచారం ప్రాజెక్టు, హల్దివాగు ద్వారా దాదాపు 10 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కాగా నిజాంసాగర్‌ నిండుతుండడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


శ్రీరామసాగర్‌ గేట్ల మూసివేత 

నిజామాబాద్‌ జిల్లా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు గేట్లను అధికా రులు మూసివేశారు.  బుధవారం ఉదయం 6గంటలకు 63వేల ఇన్‌ఫ్లో రావడంతో ఎనిమిది గేట్ల ద్వారా 25వేల క్యూసెక్కు ల నీటిని ప్రాజెక్టులోకి విడుదల చేశారు. గంట వ్యవధిలోనే ప్రాజెక్టులోకి 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తగ్గడంతో నాలు గు గేట్ల ద్వారా 12500క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఇక సాయం త్రం ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేశారు.

Updated Date - 2020-10-15T16:25:20+05:30 IST