మరో ఐదు రోజులే!

ABN , First Publish Date - 2020-10-04T10:23:55+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎ న్నికకు మరో ఐదు రోజుల సమయమే ఉండడంతో ప్రధాన

మరో ఐదు రోజులే!

9న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 

అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పార్టీలు

క్యాంపులకు టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు

నేడు తరలి వెళ్లనున్న కాంగ్రెస్‌ నాయకులు

ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం


నిజామాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎ న్నికకు మరో ఐదు రోజుల సమయమే ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. ఓటర్లను హైదరాబాద్‌కు తరలించి క్యాంపులు ని ర్వహిస్తున్నారు. 9న పోలింగ్‌ రోజు నేరుగా కేం ద్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి పోతన్‌కార్‌ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ నుంచి సు భాష్‌రెడ్డి పోటీ పడుతున్న విషయం తెలి సిందే. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎంపీటీసీ లు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులు క లిపి మొత్తం 824 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి లో అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన ప్ర జాప్రతినిధులే 570 మంది ఉండగా, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన సుమా రు 50 మంది ఇటీవలే ఆ పార్టీలో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం మరింత పెరిగింది.


కవితకు భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఎలాంటి సమస్య తలెత్తకుండా నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల ందరినీ శుక్ర, శని వారాల్లో హైదరాబాద్‌ తరలించారు. ముం దు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందరికీ కరోనా పరీక్షలు సై తం నిర్వహించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న రిసార్ట్‌లలో 5 రోజుల పాటు ఉంచి పోలింగ్‌ రోజున జిల్లాకు తీసు కొచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు ఈ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ తరఫున గెలి చిన ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో బీజేపీ నేతలు సైతం అప్రమత్తమయ్యారు. తమ పార్టీకి చెందిన కా ర్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో హైదరాబా ద్‌ శివారులో క్యాంపు నిర్వహిస్తున్నారు.


అసమ్మతి నేతలను గుర్తించి బుజ్జగిస్తున్నారు. పార్టీ రాష్ట్ర నేతలు కూడా వీరితో సమావేశమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, టీఆర్‌ఎస్‌ తర్వాత అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న కాంగ్రెస్‌ నేతలు కూడా తమ వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోధన్‌లో మా జీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పోటీలో ఉన్న అభ్యర్థి సుభాష్‌రెడ్డి వారితో శనివారం చర్చలు జరిపారు. ఆదివారం వీరిని కూడా క్యాంపునకు తరలించే అవకాశం ఉంది. కాగా, పోలింగ్‌కు ఐదు రోజుల సమయమే ఉండడంతో జిల్లా యంత్రాంగం ఏ ర్పాట్లలో నిమగ్నమైంది. మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. ఉప ఎన్నిక కోసం ఇప్పటికే రెండు దఫాలు గా పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 

Updated Date - 2020-10-04T10:23:55+05:30 IST