నిజామాబాద్: బైక్‌ను ఢీకొన్న కారు

Jun 16 2021 @ 11:06AM

నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు గన్నారంకు చెందిన సాయిలుగా గుర్తించారు. టోల్‌ప్లాజా అధికారుల నిర్లక్ష్యం వల్ల యూటర్న్ వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  జాతీయ రహదారిపై గన్నారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.