నిజాంసాగర్‌ నిండెన్‌

ABN , First Publish Date - 2020-10-16T07:17:21+05:30 IST

నాలుగేళ్ల తర్వాత నిజాం సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థా యిలో నిండింది. ఎగువ ప్రాంతాలతో పాటు మం జీరా నదివెంట ఒక లక్షా 856 క్యూసెక్కుల వరద

నిజాంసాగర్‌ నిండెన్‌

నాలుగేళ్ల తర్వాత నిండిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు

ప్రాజెక్టులోకి లక్షా 856 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

పద్నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు  విడుదల చేస్తున్న ప్రాజెక్టు అధికారులు

యాసంగిలో సాగుకు పుష్కలంగా సాగునీరు 

ఆనందంలో ఉమ్మడి జిల్లా ఆయకట్టు రైతాంగం

పెద్ద సంఖ్యలో తరలొచ్చిన పర్యాటకులు

ప్రాజెక్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు


నిజాంసాగర్‌, అక్టోబరు 15 : 

నాలుగేళ్ల తర్వాత నిజాం సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థా యిలో నిండింది. ఎగువ ప్రాంతాలతో పాటు మం జీరా నదివెంట ఒక లక్షా 856 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరు తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో గురువారం గోదావరి బే సిన్‌ కమిషనర్‌ మధుసూ దన్‌ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాజెక్టు పద్నాలు గు గేట్లుఎత్తి లక్షా 856 క్యూసెక్కు ల మిగులు జలాలను మంజీరా నది లోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,405(17.802 టీఎంసీలు) అడుగులు కాగా.. అధికారులు ప్రా జెక్టులో 1403.75 (16.012 టీఎంసీ లు) అడుగుల నీటి సామ ర్థ్యాన్ని నిల్వచేస్తూ మిగు లు జలాలను దిగువకు వదులుతున్నారు. 


నాలుగేళ్ల తర్వాత నిండిన ప్రాజెక్టు

కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పొంగిపొర్లడం తో నిజాంసాగర్‌కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి నాలుగేళ్ల తర్వాత నిం డింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో ఉమ్మ డి నిజామాబాద్‌ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యేడాది యాసంగిలో ఆయకట్టుకు పుష్కలంగా సాగు నీరు అందుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


సమైక్యాంధ్రలో మొట్టమొదటి ప్రాజెక్టు

సమైక్యాంధ్రపాలనలో తెలంగాణ జిల్లాల్లో నిజాం ప్రభుత్వ హయాంలో ని ర్మించిన మొట్టమొదటి ప్రాజెక్టు నిజాంసాగర్‌. 1921వ సంవత్సరంలో మంజీరా నదిపై అచ్చంపేట గ్రామ సమీపంలో 31 కోట్ల రూపాయల వ్యయంతో నిజాంసాగర్‌ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో 2 లక్షల 75 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో.. 29 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిం చారు. కాల క్రమేణా ఎగువ ప్రాంతాల నుంచి వరదతో పా టు ఇసుక కూడా వచ్చి మేట వేయడంతో 1976 నాటికే ని జాంసాగర్‌ నీటి సామర్థ్యం 17 టీఎంసీలకు పరిమి తమైంది. 1976 నుంచి 2020 వరకు మరో మూడు టీఎంసీల పూడిక చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ సా మర్థం్య 14 టీఎంసీలకు పడి పోయిందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తు న్నారు. ప్రభుత్వాలు, పా లకులు మారినా నిజాం సాగర్‌ నిర్వహణపై నిర్ల క్ష్య వైఖరి అవలంబిస్తు న్నారనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. తెలంగా ణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక నిజాంసాగర్‌ ప్రాజె క్టు పరిసర ప్రాంతాలన్నింటినీ ప ర్యాటక రంగంగా తీర్చిదిద్దుతామన్న హా మీలు ఇచ్చినప్పటికీ అవి నేటికీ అమలుకు నో చుకోవడం లేదు. మరో వైపు ప్రాజెక్టు నిర్వహణ సిబ్బంది లే క అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఇకనై నా ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.


పెద్ద సంఖ్యలో తరలొచ్చిన పర్యాటకులు

నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తిన సమాచారం తె లుసుకున్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పర్యాటకులతో పా టు సంగారెడ్డి, మెదక్‌, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చా రు. నిజాంసాగర్‌ వరద గేట్ల నుంచి విడుదలవుతున్న నీటిని చూసి సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటకులు పెద్ద సంఖ్య లో తరలిరావడంతో ప్రాజెక్టు పరిసరాలు జనంతో కిటకిటలా డాయి. పోలీసులు దాదాపు రెండు కిలో మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేసినప్పటికీ రోడ్డు వెంట కాలి నడకన పర్యాటకులు తరలివచ్చారు. చాలా ఏళ్ల తర్వాత నిజాంసా గర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు పరిసరాలు, ప్రాచీన కట్టడాల వద్ద కనీస సౌకర్యాలు లేకుండా పోయాయి. ప్రాజె క్టుకు వచ్చిన పర్యాటకులు అసంతృప్తితో గార్డెన్లలో, ప్రాచీన కట్టడాల్లో సేద తీరారు. 


భారీ పోలీసు బందోబస్తు

చాలా కాలం తర్వాత నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో మన రాష్ట్రంతో పా టు మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన మూడు రాష్ర్టాల పర్యాట కులు తరలిరావడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైం ది. బాన్సువాడ డివిజన్‌ పరిధిలోని పెద్ద కొడప్‌గల్‌, బిచ్కుం ద, నిజాంసాగర్‌ ఎస్సైలు నిజాంసాగర్‌ ప్రాజెక్టుపై బందోబ స్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. సందర్శనకు వచ్చే పర్యాటకులు సైతం జాగ్రత్తలు తీసుకోవా లని వారు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-16T07:17:21+05:30 IST