సమాచారమే లేదా.. ఇక నువ్వెందుకు!

ABN , First Publish Date - 2020-10-27T07:22:38+05:30 IST

సమాచారమే లేదా.. ఇక నువ్వెందుకు!

సమాచారమే లేదా.. ఇక నువ్వెందుకు!

 పెళ్లకూరు ఎంఈవోపై జేసీ ఆగ్రహం 


పెళ్లకూరు,  అక్టోబరు 26 : ‘నీ దగ్గర సమాచారమే లేదా? అలాంటప్పుడు ఇక్కడ నువ్వెందుకు’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌-2 డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఉదయం మండలంలో పర్యటించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో  తాళ్వాయిపాడు సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయ నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన శిరసనంబేడు, చెంబేడు, చిల్లకూరు గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించారు. చిల్లకూరు సచివాలయం వద్ద మండలంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎంత మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారని జేసీ ప్రశ్నించగా ఎంఈవో సుబ్రహ్మణ్యం నీళ్లునమిలారు.


దాంతో కోపోద్రేకులైన జేసీ నీ దగ్గర సమాచారమే లేదుకదా.. ఇక్కడ నువ్వెందుకని మండిపడ్డారు. చిల్లకూరులో వైఎ్‌సఆర్‌ క్లినిక్‌ భవన నిర్మాణ పనులను ఎందుకు ప్రారంభించలేదని, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను సంప్రదించి వెంటనే చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ నందకుమార్‌, ఏఈ ప్రకా్‌షలను ఆదేశించారు. చిల్లకూరులో ప్రతి 15 రోజులకోసారి కరోనా పరీక్షలు ఎందుకు నిర్వహించడంలేదని పెళ్లకూరు వైద్యాధికారి వికా్‌సను ప్రశ్నించారు. జేసీ వెంట నాయుడుపేట ఆర్డీవో సరోజిని,  డిప్యూటీ డీఈవో ఉషా, డీఎల్‌పీవో వెంకటరమణ,  తహసీల్దారు రాజ్‌కుమార్‌, ఎంపీడీవో ప్రమీలారాణి, డీటీ శ్రీనివాసులు, అన్నిశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T07:22:38+05:30 IST