పోలీసుశాఖకు స్కోచ్‌ అవార్డు

ABN , First Publish Date - 2020-10-29T10:55:54+05:30 IST

జిల్లా పోలీసు శాఖకు అరుదైన గౌరవం లభించింది. ఓ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందించే స్కోచ్‌ అవార్డును సాంకేతిక విభాగంలో జిల్లా పోలీసు శాఖ దక్కించుకుంది.

పోలీసుశాఖకు స్కోచ్‌ అవార్డు

నెల్లూరు(క్రైం),అక్టోబరు28:  జిల్లా పోలీసు శాఖకు అరుదైన గౌరవం లభించింది. ఓ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందించే స్కోచ్‌ అవార్డును సాంకేతిక విభాగంలో జిల్లా పోలీసు శాఖ దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి బుధవారం న్యూఢిల్లీలో అవార్డులు అందించారు. డైనమిక్‌ ఈ బీట్స్‌ వ్యవస్థకు సంబంధించిన రంగంలో జిల్లాకు అవార్డు లభించింది. ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఈ ఏడాది మార్చి నుంచి ఈ బీట్స్‌ వ్యవస్థను జిల్లాలో ప్రవేశ పెట్టారు. ఈ వ్యవస్థ సాంకేతికంగా ప్రసిద్ధి చెందింది. ఈ సాంకేతకతో బీట్ల పక్రియలో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంది. ఇక  విజుబుల్‌ పోలీసింగ్‌ పెరిగింది. ఈ బీట్స్‌ ప్రక్రియను సిద్ధం చేయడంలో ఐటీ కోర్‌ సిబ్బంది కృషి ఎంతో ఉంది. 

Updated Date - 2020-10-29T10:55:54+05:30 IST