ప్రజల్లో నమ్మకం కలిగించేలా పాలన

ABN , First Publish Date - 2020-10-29T11:02:30+05:30 IST

ప్రజల్లో నమ్మకం కలిగించేలా పాలన అందించేందుకు కృషి చేస్తానని కావలి ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు. ఇన్‌చార్జి ఆర్డీవో దాసు నుంచి బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ప్రజల్లో నమ్మకం కలిగించేలా పాలన

 బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో శ్రీనివాసులు


కావలి, అక్టోబరు 28: ప్రజల్లో నమ్మకం కలిగించేలా పాలన అందించేందుకు కృషి చేస్తానని కావలి ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు. ఇన్‌చార్జి ఆర్డీవో దాసు నుంచి బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కావలి సబ్‌కలెక్టర్‌గా ఉన్న దాసు బదిలీపై వెళ్లిన తర్వాత ఆయన స్థానంలో నియమితులైన సివిల్‌సప్లయ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంవీ సుధాకర్‌ను ఆర్డీవోగా నియమించారు. ఆయన ఆరోగ్య సమస్యలతో సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఎం.దాసు అనే మరో అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల గాలేరు-నగరి సుజల స్రవంతిలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న జీ.శ్రీనివాసులును రెగ్యులర్‌ ఆర్డీవోగా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన పులివెందుల, ప్రొద్దుటూరు, కడప తహసీల్దార్‌గా పనిచేసి అక్కడ ఆర్డీవోగా పదోన్నతి పొంది, గాలేరు-నగరి సుజల స్రవంతిలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆర్డీవో కార్యాలయ ఏవో శ్రీనివాసులు, కావలి, అల్లూరు, బోగోలు తహసీల్దార్లు, సిబ్బంది ఆర్డీవోకు పుష్పగుచ్ఛం అందచేసి శాలువతో సత్కరించారు.

Updated Date - 2020-10-29T11:02:30+05:30 IST