ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్‌ ఫీజు చెల్లింపు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-10-30T11:00:03+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూలు)లో దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందేందుకు అడ్మిషన్‌ ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్‌ ఫీజు చెల్లింపు గడువు పెంపు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), అక్టోబరు 29: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూలు)లో దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందేందుకు అడ్మిషన్‌ ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం నవంబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఓపెన్‌ స్కూల్స్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఎల్‌సీ రమణారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఠీఠీఠీ.్చఞౌఞ్ఛుఽటఛిజిౌౌజూ.ౌటజ వెబ్‌సెట్‌ ద్వారా లాగిన్‌ కావాలని తెలిపారు. పదో తరగతి అడ్మిషన్‌ పొందటానికి ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి వయసు 14 ఏళ్లు, ఇంటర్‌లో చేరడానికి 15 ఏళ్లు నిండి ఉండాలన్నారు.

Updated Date - 2020-10-30T11:00:03+05:30 IST