సంచుల్లేకుండా పొంగల్‌ కానుక తీసుకోండి

ABN , First Publish Date - 2022-01-09T15:35:35+05:30 IST

పొంగల్‌ కానుకల కోసం అవసరమైన సంచుల కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాక చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ప్రజలు ఆ సంచులు లేకుండానే పొంగల్‌ కానుకలు తీసుకోవాలని

సంచుల్లేకుండా పొంగల్‌ కానుక తీసుకోండి

- ప్రభుత్వ విజ్ఞప్తి


ప్యారీస్‌(చెన్నై): పొంగల్‌ కానుకల కోసం అవసరమైన సంచుల కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాక చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ప్రజలు ఆ సంచులు లేకుండానే పొంగల్‌ కానుకలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో వున్న బియ్యం కుటుంబ కార్డుదారులకు 20 రకాల సరుకుల కిట్‌ను పొంగల్‌ కానుకగా పంపిణీ చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 45.1 శాతం రేషన్‌ కార్డు దారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. కొన్ని ప్రాంతాల్లోని రేషన్‌ దుకాణాల్లో సంచులు కొరత కారణంగా పొంగల్‌ సరకుల పంపిణీలో జాప్యం ఏర్పడినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో గుడ్డ సంచుల తయారీలో అంతరాయం ఏర్పడడంతో ఈ కొరత ఏర్పడినట్లు గుర్తించిన అధికారులు.. తదుపరి చర్యలకుదిగారు. ఇందులో భాగంగా ప్రజలు సంచులు లేకపోయినా పొంగల్‌ కానుకను తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సంచులు లేకుండా పొంగల్‌ సరకులు పొందే లబ్ధిదారులకు ప్రత్యేకంగా టోకెన్లు ఇస్తారని, ఆ తరువాత ఆ టోకెన్లతో సంచులు తీసుకోవని ప్రభుత్వం పేర్కొంది. పొంగల్‌లోపు రాష్ట్ర వ్యాప్తంగా వున్న లబ్దిదారులందరికీ ఈ కానుక పంపిణీ చేయాలని పౌరసరఫరా శాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2022-01-09T15:35:35+05:30 IST