‘బృహత్‌ పల్లెప్రకృతి వనం వద్దు’

ABN , First Publish Date - 2021-07-27T06:07:18+05:30 IST

జీవాల మేతకు అనువుగా ఉన్న ప్రాంతంలో బృహత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పా టు చేయొద్దని గొర్రెకాపరుల సంఘం సభ్యులు డీఆర్‌డీఏ పీడీ కాళిందినిని నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినే డులో సోమవారం అడ్డుకున్నారు.

‘బృహత్‌ పల్లెప్రకృతి వనం వద్దు’

చిట్యాల రూరల్‌, జూలై 26: జీవాల మేతకు అనువుగా ఉన్న ప్రాంతంలో బృహత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పా టు చేయొద్దని గొర్రెకాపరుల సంఘం సభ్యులు డీఆర్‌డీఏ పీడీ కాళిందినిని నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినే డులో సోమవారం అడ్డుకున్నారు. తమ కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో జీవాలను మేపుకుంటూ జీవనాన్ని కొనసా గిస్తున్నాయని, ఇక్కడ బృహత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తే జీవాలకు మేత దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న భూమిలో ఇప్పటికే పల్లె ప్రకృతివనం, రైతు వేదికను ఏర్పాటు చేశారని, బృహత్‌ ప్రకృతివనం ఏర్పాటుతో జీవనాధారాన్ని కోల్పోతామని పీడీకి వివరించారు. భూమి రికార్డులను పరిశీలించి ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా జరి గేలా చర్యలు తీసు కుంటామని పీడీ వారికి హామీ ఇచ్చారు. అనంతరం గొర్రెల కాపరుల సంఘం సభ్యులు నల్లగొండకు వెళ్లి కలెక్టరేట్‌ లో వినతిపత్రం అందజేశారు. 


Updated Date - 2021-07-27T06:07:18+05:30 IST