దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR)కి మధ్య ఉన్న రిలేషన్ ఈనాటిది కాదు. కెరియర్ ఒకేసారి మొదలు పెట్టిన ఈ ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్స్‌లో మాస్టర్స్ అయ్యారు. ఇండియా (India) గర్వించదగ్గ సినిమాలు రాజమౌళి తీస్తుంటే, ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్ కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాడు. ఎవరు ఎంత బిజీగా ఉన్నా, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. తారక్, రాజమౌళి ఒకరికొకరు ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు. ఈ ఇద్దరి మధ్య ఇంత మంచి రిలేషన్ ఉంది కాబట్టే... ఎప్పుడు రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వచ్చినా.. తెరపై ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ ప్రతి సినిమాకి విష్ చేసి రాజమౌళి తన ప్రేమని చాటుకుంటూ ఉంటాడు.
అయితే ట్రిపుల్ ఆర్ (RRR) విషయంలో ఎన్టీఆర్‌కి అన్యాయం జరిగింది అని ఒక వర్గం ఎన్టీఆర్ ఫాన్స్ బాహాటంగానే వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ న్యూస్ రాజమౌళి వరకూ తప్పకుండా వెళ్ళే ఉంటుంది. అయితే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి నుంచి ఎన్టీఆర్‌కి శుభాకాంక్షలు చెబుతూ.. ట్వీట్ కానీ పోస్ట్ కానీ చేయలేదు. ఈ విషయమై తారక్ ఫ్యాన్స్ (Tarak Fans)... రాజమౌళికి ఎన్టీఆర్‌కి మధ్య గ్యాప్ వచ్చిందేమో అనుకునే అవకాశం ఉంది. మరో వైపు రామ్ చరణ్ (Ramcharan), మహేష్ బాబు (Mahesh Babu) వంటి వారు తారక్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు.

అయితే, రాజమౌళి డైరెక్ట్‌గా ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పి ఉండవచ్చు.. కానీ ఒక ట్వీట్ చేసి ఉంటే... తారక్‌కి తనకి మధ్య గ్యాప్ వచ్చింది అనుకునే వాళ్లకి సమాధానం ఇచ్చినట్లు అయ్యేది. కానీ రాజమౌళి అలా చేయలేదు. అయినా వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం ఈ నాటిది కాదు కాబట్టి.. ఒక్క సినిమా, వారి మధ్య గ్యాప్ తెచ్చి ఉండకపోవచ్చు. పైగా ఎన్టీఆర్ భీమ్ పాత్రతో చాలా సంతృప్తి పొందానని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.. అంతే అద్భుతంగా సినిమాలో యాక్ట్ కూడా చేశారు. సో రాజమౌళి ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చి ఉండకపోవచ్చు. హి మైట్ బీ బిజీ విత్ హిస్ వర్క్స్.