ఇక్కడ అంత సినిమా లేదు..!

ABN , First Publish Date - 2021-07-30T06:43:12+05:30 IST

సినిమా థియేటర్లను శుక్రవారం నుంచి తెరుచుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ, 50 శాతం ఆక్యుపెన్సీతో రెండు ఆటలు వేసుకునేలా అనుమతి మంజూరు చేసింది. దానికి అనుగుణంగా రెండు మూడు సినిమాలు శుక్రవారం విడుదల అవుతున్నాయి.

ఇక్కడ అంత సినిమా లేదు..!

  • సినిమా ప్రదర్శనలకు యాజమాన్యాలు నో
  • రెండు ఆటలతో థియేటర్లు రన్‌ చేయలేం.. అందరిదీ ఒకేమాట
  • జీవో నెం.35తో బీ, సీ సెంటర్లు మనుగడ కష్టమంటున థియేటర్ల యజమానులు

కల్చరల్‌(కాకినాడ), జూలై 29: సినిమా థియేటర్లను శుక్రవారం నుంచి తెరుచుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ, 50 శాతం ఆక్యుపెన్సీతో రెండు ఆటలు వేసుకునేలా అనుమతి మంజూరు చేసింది. దానికి అనుగుణంగా రెండు మూడు సినిమాలు శుక్రవారం విడుదల అవుతున్నాయి. కానీ మన జిల్లాలో మాత్రం సినిమాల ప్రదర్శన లేదు. ఇతర జిల్లాల్లో 20 శాతం వరకు థియేటర్లు తెరుస్తున్నారు. కానీ మన జిల్లాలోని ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు మాత్రం సినిమాలను ప్రదర్శించలేమంటూ భీష్మించుకున్నారు. గురువారం తెలుగు ఫిలిం ఛాంబర్‌లో 13 జిల్లాల ఎగ్జిబిటర్లు సమావేశం జరగగా, వివిధ జిల్లాల నుంచి ఽథియేటర్ల యాజమాన్యాలు కూడా హజ రైనట్టు సమాచారం. అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో రోజుకు రెండు ఆటలు అంటే సాధ్యం కాదని, ప్రభుత్వం కూడా టిక్కెట్ల ధరల విషయంలో అనుకూల నిర్ణయం తీసుకుంటేనే తెరిచేందుకు సిద్ధమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. థియేటర్లు తెరుచుకుంటే ప్రస్తుత టిక్కెట్ల రేట్లకు సీ సెంటర్ల థియేటర్లు పూర్తి నష్టాల్లో కూరుకుపోతాయని, అందువల్ల బీ, సీ సెంటర్లలో జీవో నెం.35తో మనుగడ కష్టమని ఎగ్జిబిటర్లు, యాజమాన్యాలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో మన జిల్లా థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వం జీవోపై సరైన నిర్ణయం తీసుకునే వరకు తెరవకూడదని సమష్టి నిర్ణయం తీసుకున్నాయి. దీంతో శుక్రవారం విడుదలవు తున్న రెండు మూడు సినిమాలు కొన్ని జిల్లాలకే పరిమి తమయ్యాయి. జిల్లావ్యాప్తంగా థియేటర్లు తెరుస్తారని ఎదురుచూసిన సినీ ప్రేక్షకులకు ఇది నిరాశనే చెప్పాలి.

Updated Date - 2021-07-30T06:43:12+05:30 IST