చెడ్డ ఆలోచనలకు చికిత్స లేదు.. అఫ్రిదీకి కౌంటర్

ABN , First Publish Date - 2020-07-07T04:19:04+05:30 IST

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు.

చెడ్డ ఆలోచనలకు చికిత్స లేదు.. అఫ్రిదీకి కౌంటర్

న్యూఢిల్లీ: పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ‘భారత్‌ను మేం చాలాసార్లు చిత్తు చేశాం. ఎంతలా అంటూ ఓడిపోయిన ప్రతిసారీ భారత ఆటగాళ్లు మమ్మల్ని క్షమాపణలు అడిగేవారు’ అని అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. అఫ్రిదీ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇండియా, పాకిస్తాన్ జట్ల బలాబలాలు దాదాపు సమానంగానే ఉండేవని చోప్రా చెప్పాడు. వన్డే, టెస్టుల్లో ఇరుజట్లు దాదాపు సరిసమానంగానే ఉండేవని, కానీ టీ20ల్లో భారతే ముందంజలో ఉండేదని తెలిపాడు. ‘అందుకే గొప్పవాళ్లు చెప్పేవారు. పాము కాటుకన్నా మందుంటుందికానీ, చెడ్డ ఆలోచనలకు చికిత్స ఉండదని’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

Updated Date - 2020-07-07T04:19:04+05:30 IST