Issuance of orders: యావన్మందికీ తెలియజేయడం ఏమనగా.. ఇంక దండోరా ఉండదహో!

ABN , First Publish Date - 2022-08-04T14:03:28+05:30 IST

రాష్ట్రంలో దండోరా ప్రచారంపై నిషేధం విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు(Iraianbu) ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ముఖ్యమైన ప్రకటన

Issuance of orders: యావన్మందికీ తెలియజేయడం ఏమనగా.. ఇంక దండోరా ఉండదహో!

                                     - సీఎస్‌ ఉత్తర్వులు


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 3: రాష్ట్రంలో దండోరా ప్రచారంపై నిషేధం విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు(Iraianbu) ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ముఖ్యమైన ప్రకటనలు దండోరా వేయించడం ద్వారా ప్రజలకు తెలియజేయడం ఆనవాయితీ. వరద హెచ్చరికలు, ప్రభుత్వ ముఖ్య ప్రకటనలు, గ్రామసభలు, ఇంటి పన్నుల చెల్లింపు సహా పలు విషయాలను దండోరా(Dandora) ద్వారా తెలియజేస్తుంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా దండోరా వేయడంపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో దండోరా ప్రచారానికి నిషేధం విధిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ప్రకటనలు, హెచ్చరికలకు సంబంధించి ఇకపై దండోరా ప్రచారం చేయరాదని, నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠినచర్యలు చేపడతామని సీఎస్‌ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Updated Date - 2022-08-04T14:03:28+05:30 IST