అభివృద్ధికి ఆమడదూరం

ABN , First Publish Date - 2021-05-08T03:48:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తం గా పలు పురపాలక సంఘాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అమృత్‌ పథకం కింద ఎంపిక చేసిం ది.

అభివృద్ధికి ఆమడదూరం
మందాటి చెరువు ట్రంకురోడ్డు మధ్యలో పార్కు నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం

అమృత్‌ పథకానికి ఎంపికై ఏడేళ్లు 

ఎక్కడి పనులు అక్కడే ఆగిన వైనం

కావలి మున్సిపాలిటీలో పరిస్థితి


కావలిటౌన్‌, మే 7: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తం గా పలు పురపాలక సంఘాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అమృత్‌ పథకం కింద ఎంపిక చేసిం ది. నెల్లూరు జిల్లా పరిధిలో నెల్లూరు నగరపాలక సంస్థ, కావలి పురపాలక సంస్థలు దీని కింద ఎంపిక య్యాయి. వసతుల కల్పన, సౌకర్యాల వినియోగంలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మెరుగైన సేవలందిం చడం ఈ పఽథకం యొక్క ప్రధాన ఉద్దేశం. కావలి పట్టణం మాత్రం అభివృదిఽ్ధకి దూరంగా ఉండిపోయిం ది. కావలి పురపాలక సంస్థ అమృత్‌ పథకం కింద ఎంపికై దాదాపు ఏడేళ్లు గడిచినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు.

ఎక్కడి పనులు అక్కడే

కావలి పట్టణం అమృత్‌ పథకం కింద ఎంపికైనప్పు డు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా నారాయణ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయు డులు ఇద్దరూ జిల్లావారే. అయినా చెప్పుకోదగ్గ స్థాయి లో అభివృద్ధి జరగకపోవడం శోచనీయం. పఽథకాలు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికార యం త్రాంగం నిర్లక్ష్యం, రాజకీయ కారణాలనే చెప్పుకోవచ్చు. దీంతో అభి వృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. పట్టణంలో తాగునీటి పథకం కోసం అమృత్‌ పథకం కింద దాదాపు 100 కోట్లు మంజూరుకాగా ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం పనులు 80 శాతం పూర్తయి నప్పటికీ పైప్‌లైన్‌ నిర్మాణ పనులు 50 శాతం మాత్రమే జరిగాయి. ఇప్పటికీ ప్రధాన పైపుల నుం చి ఇతర పైపులకు అనుసంధానం పనులు ప్రారంభ మే కాలేదు. మూడేళ్ల నుంచి పనులు పూర్తిగా ని లిచిపోయాయి. రోడ్డు డివైడర్ల నిర్మాణం, సెంట్రల్‌ లై టింగ్‌, మొక్కల పెంపకం పనులు కేవలం ట్రంకు రోడ్డులో కొంతభాగం, ఉదయగిరి రోడ్డులో కొంత భా గం మాత్రం జరిగాయి. మిగిలిన రోడ్ల అభివృద్ధి, ఆక ర్షణీయం పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మం దాటి చెరువుకట్ట వాకింగ్‌ ట్రాక్‌గా అభివృద్ధి చేసినప్ప టికీ నిర్వహణ కొరవడి దుర్భరంగా మారింది. దాని పక్కన ట్రంకురోడ్డు ఆనుకుని పార్కు నిర్మాణ పనులకు శిలాఫలకం వేసి ఉన్నారు. వివేకానంద పార్కు, రాజీవ్‌నగర్‌లోని రెండు పార్కులు, పట్ణణ ఉత్తరం వైపు గతంలో డబ్బింగ్‌ యార్డుకు చెందిన 9 ఎకరాల స్థలంలో మెగా పార్కు నిర్మాణం పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. 

ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు

పట్టణాభివృద్ధి కోసం రూపొందిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి పనులు ప్రాధాన్యతా క్రమంలో జరుగుతాయి. ట్రం కురోడ్డు డివైడర్‌ విస్తరణ పనులు, సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మాణం కోసం నిధులు మం జూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. అసంపూర్తిగా ఉన్న పార్కుల నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయి. మందాటి చెరువు దగ్గర పార్కు నిర్మాణ పనులు ప్రారంభమ య్యాయి.       

- మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి


Updated Date - 2021-05-08T03:48:46+05:30 IST