నెలరోజులుగా తాగునీటికి కటకట

ABN , First Publish Date - 2022-08-19T05:27:53+05:30 IST

మండలకేంద్రమైన తనకల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ చిన్న గ్రామం బొమ్మలకుంట. తనకల్లుకు కూత వేటు దూ రంలోనే ఉన్న ఆ గ్రామస్థులు నెలరోజులు గా తాగునీటి కోసం చాలా అ వస్థలు పడుతున్నారు.

నెలరోజులుగా తాగునీటికి కటకట
బొమ్మలకుంట చెరువులో ఏర్పాటు చేసిన తాగునీటి బోరు, నేలపై ఉంచిన స్టార్టర్‌






 బొమ్మలకుంట గ్రామస్థులకు 

వ్యవసాయ బోర్లే దిక్కు

చోద్యం చూస్తున్న ఆధికార యంత్రాంగం

తనకల్లు, ఆగస్టు 18: మండలకేంద్రమైన తనకల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ చిన్న గ్రామం బొమ్మలకుంట. తనకల్లుకు కూత వేటు దూ రంలోనే ఉన్న  ఆ గ్రామస్థులు నెలరోజులు గా తాగునీటి కోసం చాలా అ వస్థలు పడుతున్నారు. గ్రామానికి చుట్టు పక్కల ఉన్న వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి తాగునీటిని సరఫరా చేయడానికి పంచాయతీ వారు సమీప చెరువులో బోరు వేసి, మోటారు బిగించి, స్టార్టర్‌ అమర్చారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చెరువులో నేలపైనే స్టార్టర్‌ ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండిపోవడంతో స్టార్టర్‌ నీటిలో మునిగి కాలి పోయింది. దాదాపు నెలరోజులు కావస్తున్నా స్టార్టర్‌ మరమ్మతులకు నో చుకోలేదు. అధికా రులు గానీ, ప్రజాప్ర తినిధులు గానీ పట్టించుకున్న పాపా న పోలేదు. ఈ కార ణంగా బోరులో సమృద్ధిగా నీరు ఉన్నా తాగునీటికి వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. నెలరోజు లుగా కాలికి బలపం కట్టుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామంలోని పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకునే నాథుడే లేడని  ఆవేదన చెందు తున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించితమకు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.  

నాలుగు రోజుల్లోగా పరిష్కరిస్తాం - కేఎం రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, తనకల్లు

బొమ్మలకుంట గ్రామంలో నెలరోజులుగా తాగునీటి సమస్య ఉన్న విషయం ఇప్పుడు తెలిసింది.  నాలుగు రోజులలోగా స్టార్టర్‌ మరమ్మతు లు చేయిస్తాం. ఆ గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తాం. 


Updated Date - 2022-08-19T05:27:53+05:30 IST