చుక్క నీరు రాదు

ABN , First Publish Date - 2022-06-25T05:24:14+05:30 IST

రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల పరిధిలోని పాపాఘ్ని నదిపై 2008లో వెలిగల్లు ప్రాజెక్టును సుమారు రూ.208 కోట్లతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గాలి వీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో సుమా రు 26 వేల ఎకరాల ఆయకట్టు, రాయచోటి పట్టణాని కి తాగునీరు లక్ష్యంగా 4.62 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2015లో సుమారు నెల రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. అప్పట్లో ప్రా జెక్టు నిండింది. అయినా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లు విడుదల చేయలేదు. ప్రధాన కాలువలతో పా టు.. పిల్లకాలువలు పూర్తి కాలేదు.

చుక్క నీరు రాదు
కొర్లకుంట వద్ద ప్రధాన కాలువలో పెద్దపెద్ద రాళ్లు

14 ఏళ్లుగా రైతుకంట కన్నీరు  

ప్రాజెక్టు నిండా నీళ్లు.. కాలువల్లో గుండ్లు    

వెలిగల్లు ఆయకట్టుదారుల ఎక్కిళ్లు


కరువు పేరెత్తగానే.. ఠక్కున గుర్తొచ్చే ప్రాంతం.. పనులు లేక.. పస్తులుండలేక.. పొట్టచేత పట్టుకుని ఎక్కడికో వలసలు పోయే ప్రాంతం.. వాన దయదలిస్తేనే.. పంటలు పండే దౌర్భాగ్యం.. అటువంటి కరువుగడ్డపై సుమారు రూ.208 కోట్లతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు పూర్తయి ఇప్పటికి సుమారు 14 సంవత్సరాలు గడుస్తోంది. ఇంత వరకు ప్రాజెక్టు పూర్తిగా నిండింది లేదు.. ఆయకట్టుకు ఒకకారైనా పంట పండింది లేదు.. అయితే గతేడాది నుంచి కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు పూర్తి సామర్థ్యం మేర నీళ్లు వచ్చి నిండుకుండలా తొణికిసలాడుతోంది. కానీ ఆయకట్టులో సెంటు భూమికి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ప్రధాన కాలువల్లో.. పెద్దపెద్ద గుండ్లు, కంపచెట్లు, ముళ్ల పొదలు.. అడ్డంగా ఉన్నాయి. ఫలితంగా అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుని నోట్లో శని అన్న చందంగా తమ పరిస్థితి తయారైందని వెలిగల్లు ఆయకట్టుదారులు వాపోతున్నారు. 


రాయచోటి, (ఆంధ్రజ్యోతి): రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల పరిధిలోని పాపాఘ్ని నదిపై 2008లో వెలిగల్లు ప్రాజెక్టును సుమారు రూ.208 కోట్లతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గాలి వీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో సుమా రు 26 వేల ఎకరాల ఆయకట్టు, రాయచోటి పట్టణాని కి తాగునీరు లక్ష్యంగా 4.62 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2015లో సుమారు నెల రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. అప్పట్లో ప్రా జెక్టు నిండింది. అయినా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లు విడుదల చేయలేదు. ప్రధాన కాలువలతో పా టు.. పిల్లకాలువలు పూర్తి కాలేదు. కాలువలు పూర్తి చే యకుండానే.. కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లు కాజే శారనే ఆరోపణలు ఉన్నాయి. కాలువల పూర్తి కాని కారణంగా.. అప్పట్లో పొలాలకు నీళ్లు ఇవ్వలేకపోయా రు. ఆ తర్వాత గతేడాది నుంచి కురిసిన వర్షాలకు వెలిగల్లు ప్రాజెక్టులోకి భారీగా నీళ్లు రావడంతో ప్రస్తు తం నిండుకుండలాగా తొణికిసలాడుతోంది. అయినా ఆయకట్టుకు చుక్కనీళ్లు విడుదల చేయలేని దుస్థితి..


24 వేల ఎకరాల ఆయకట్టు..

వెలిగల్లు ప్రాజెక్టుకు కుడి, ఎడమ కలిపి 52 కి.మీ. ప్ర ధాన కాలువలు ఉన్నాయి. వీటి కింద 140 కి.మీ. పిల్ల కాలువలు (సబ్‌కెనాల్‌) ఉన్నాయి. ఈ కాలువల ద్వా రా సుమారు 24 వేల ఎకరాలకు నీళ్లు అందివ్వాలి.. కు డి కాలువ ద్వారా గాలివీడు మండలంలో గాలివీడు, పేరంపల్లె, గరుగుపల్లె, గుండ్లచెరువు, పందికుంట, బో ర్రెడ్డిగారిపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలంలో లక్కిరెడ్డిపల్లె, దిన్నెపాడు, కుర్నూతల, పందిళ్లపల్లె, రామాపురం మం డలంలో చిట్లూరు, రాచపల్లె, హసనాపురం, గంగనేరు, నల్లగుట్టపల్లె గ్రామాలలో 23,400 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువ ద్వారా వెలిగల్లు, తూముకుంట గ్రామాల్లో 600 ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు పూర్తయి 14 సంవత్సరాలు అవుతున్నా.. ఇంత వరకూ.. ఆయకట్టు చివరి వరకు నీళ్లు పారలేదు. 


పూడిపోయిన ప్రధాన కాలువలు

ప్రాజెక్టు నుంచి వెళ్లే ప్రధాన కాలువలు దాదాపుగా పూడిపోయాయి. జమ్ముమొక్కలు మొలిచి చాలా ఎత్తుగా పెరిగాయి. మట్టి సైతం పెద్ద ఎత్తున పేరుకు పోయింది. బోరెడ్డిగారిపల్లె గ్రామ పరిధిలో కాలువల్లో పెద్ద పెద్ద గుండ్లు పక్కనున్న కొండ నుంచి పడ్డాయి. కాలువలో కంపచెట్లు, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు విపరీతంగా పెరిగాయి. కొర్లకుంట, పందికుంట గ్రా మాల్లో ఎక్కువగా కాలువలు పూడిపోయాయి. కాలువ లు నిర్మించినప్పటి నుంచి ఇంతవరకు పూడికతీయ లేదని రైతులు వాపోతున్నారు. అదే సమయంలో పలుచోట్ల కాలువలు గత సంవత్సరం కురిసిన వర్షా లకు దెబ్బతిన్నాయి. పిల్లకాలవల దుస్థితి గురించి చెప్పనవసరం లేదు. గతేడాది ప్రధాన కాలువల మరమ్మతుల కోసం పనులు ప్రారంభించారు. కొంత దూరం చేసిన తర్వాత.. కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు. బిల్లులు చెల్లించకపోవడంతో.. పనులు చేయకుండా.. కాంట్రాక్టర్‌ ముఖం చాటేసినట్లు తెలిసిం ది. ప్రస్తుతం కాలువుల పూడిక తీయకుండా.. ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలినా.. పొలాలకు చుక్కనీరు వెళ్లదని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే తగినన్ని నిధులు విడుదల చేసి కాలువలు పూడిక తీయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే  రూ.208 కోట్లు వ్యయం చేసి నిర్మించిన ప్రాజెక్టుతో ఏం ఉప యోగమని ఈ ప్రాంత రైతులు పేర్కొంటున్నారు. 


నేడు వెలిగల్లు నుంచి నీరు విడుదల

జిల్లాలోని వెలిగల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి శనివారం సాయంత్రం ఐదుగంటలకు నీరు విడుదల చేయనున్నామని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెలిగల్లు ప్రాజెక్టు సామర్థ్యం 420 ఎఫ్‌ఆర్‌ఎల్‌ కాగా ప్రస్తుతం 419.5 మీటర్ల మేర నీరు ఉందని తెలిపారు. ఒకవేళ వర్షాలు వస్తే ప్రాజెక్టు గేట్ల నుంచి నీరు పొర్లే అవకాశముందని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తెలిపారని.. ఈ మేరకు నీటిని కిందకు విడుదల చేస్తున్నామని వివరించారు. పాపాగ్ని నది పరీవాహక ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నది పరిసరాల్లోకి ఎవ్వరూ వెళ్లరాదని  సూచించారు. 


కాలువలు శుభ్రపరచాలి..

వెలిగల్లు ప్రాజెక్టు కాలు వలు పూర్తిగా మట్టితో.. చెట్లతో.. రాళ్లు, గుండ్లతో పూడిపోయింది. ప్రాజె క్టు నిండా నీళ్లు ఉన్నా.. కాలువలు లేకపోవడం తో  పంట కాలువల కు రావడం లేదు. దీంతో పంట సాగు చేసుకోలేకపోతున్నాం. గత రెండు సంవత్సరాలు గా ఇలాగే నష్టపోతున్నాం. ఇప్పటికైనా లు కాలువలను శుభ్రపరచి నీటిని విడుదల చేయాలి.

- మహేశ్వర్‌రెడ్డి, కొర్లకుంట గ్రామం, గాలివీడు


పిల్ల కాలువలు పూర్తి చేయాలి..

వెలిగల్లు ప్రాజెక్టు పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాన కాలువలు మినహా పిల్ల కాలువలు పూర్తి కాలేదు. అరకొర ఉన్న పిల్లకాలువలు కూడా పూర్తిగా మట్టితో పూడిపోయాయి. గత రెండు సంవత్సరాలుగా వెలిగల్లు పూర్తి స్థాయిలో నిండినా.. వ్యవసాయ భూములకు నీటిని అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి బీడు భూములను పంట భూములుగా మార్చేందుకు కృషి చేయాలి. 

- కదిర్రెడ్డినాయుడు, తూముకుంట, గాలివీడు



Updated Date - 2022-06-25T05:24:14+05:30 IST