రహదారుల నిర్మాణానికి నిధులివ్వరూ..

ABN , First Publish Date - 2021-07-30T06:05:59+05:30 IST

నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలో రవాణా సౌకర్యాల మెరుగునకు రహదారుల నిర్మాణానికి విడుదల చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీని కోరారు.

రహదారుల నిర్మాణానికి నిధులివ్వరూ..
కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిప్రతం అందిస్తున్న ఉత్తమ్‌

కేంద్ర మంత్రి నితినగడ్కరీకి ఎంపీ ఉత్తమ్‌ వినతి
నల్లగొండ, జూలై 29 :
నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలో  రవాణా సౌకర్యాల మెరుగునకు రహదారుల నిర్మాణానికి విడుదల చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీని కోరారు.  ఈ మేరకు గురువారం గడ్కరీని కలిసి కోరారు.  ఈ మేరకు గురువారం గడ్కరీని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్‌ మాట్లాడుతూ నేషనల్‌ హైవే 167పరిధిలోని కోదాడ నుంచి జడ్చర్ల హైవేపై చాలా పట్టణాల్లో రెండు లైన్ల రహదారులు ఉండి రవాణా సౌకర్యానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నేరేడుచర్ల మునిసిపాలిటీ, ముకుందాపురం, అప్పన్నపేట, సీతారాంపురం, చిలుకూరు ప్రాంతాల్లో నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణానికి రూ.140.80కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. నేషనల్‌ హైవే 167పై కోదాడ నుంచి జడ్చర్ల వరకు వయా హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నిడమనూరు, హాలియా, మల్లేపల్లి మీదుగా సాగే నిర్మాణాలకు రూ.222కోట్లు మంజూరయ్యాయని, మెరుగైన సౌకర్యాలకు తాము కోరి న విధంగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. అంచనా ప్రకారం జాతీయ రహదారి 167కు సు మారు రూ.1100కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశామని, అం దుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ము కుందాపురం మేజర్‌ గ్రామ పంచాయతీ కాగా ఈ ప్రాంతంలో రెండు లైన్ల రహదారితో ఇబ్బందిగా ఉందని, నాలుగు లైన్ల రోడ్డు నిర్మించాలన్నారు. నేరేడుచర్ల మునిసిపాలిటీ అభివృద్ధికికి నాలుగు లైన్ల రహదారి అవసరమన్నారు. ఈ మునిసిపాలిటీలో ట్రాఫిక్‌ అధికంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని గరిడేపల్లి నుంచి అలింగాపూర్‌ రోడ్డుకు సీఆర్‌ఎఫ్‌ నిధులు కేటాయించాలన్నారు. ఈ రోడ్డుకు రూ.24కో ట్లు అవసరం ఉంటుందన్నారు. అదేవిధంగా శా ంతినగర్‌ నుంచి నడిగూడెం వరకు ఉన్న సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డు చేయడానికి రూ.15కోట్లు, సూర్యాపేట నుంచి అశ్వరావుపేట రోడ్డును డబుల్‌ లైన చేయడానికి రూ.28.80 కోట్లు డిండి నుంచి దేవరకొండకు, అట్నుంచి కంభాలపల్లి వరకు రూ.40కోట్లు, ముకుందాపురం, తుమ్మ డం, అడవిదేవులపల్లి వరకు రోడ్ల నిర్మాణానికి రూ.14కో ట్లు, త్రిపురారం నుంచి అడవిదేవులపల్లికి రూ.19కోట్లు కేటాయించాలన్నారు.

Updated Date - 2021-07-30T06:05:59+05:30 IST