Ganpati idol immersion: గణపతి నిమజ్జనంపై హైకోర్టు సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-09T18:20:21+05:30 IST

గణపతి నిమజ్జనంపై బాంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది....

Ganpati idol immersion: గణపతి నిమజ్జనంపై హైకోర్టు సంచలన నిర్ణయం

ముంబయి: గణపతి నిమజ్జనంపై బాంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముంబయిలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కు(Sanjay Gandhi National Park) జలాశయంలో గణపతి విగ్రహాల నిమజ్జనం(Ganpati idol immersion) చేయకుండా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి, అటవీశాఖకు బాంబే హైకోర్టు(Bombay High Court) ఆదేశించింది. జస్టిస్ పీబీ వరాలీ, ఎస్ఎం మొదక్ లలతో కూడిన బెంచ్ ఈ సంచలన ఆదేశాలు ఇచ్చింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా గణేష్ నిమజ్జనం చేస్తే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.(No Ganpati idol immersion) 


నేషనల్ పార్కు జలాశయంలో వినాయక నిమజ్జనం జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అటవీశాఖ పోలీసులను కోరింది. ముంబయి ఎన్జీఓ  తరపున లాయర్లు సమర్పించిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 


Updated Date - 2022-09-09T18:20:21+05:30 IST